మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం అవసరమైతే తప్ప మాట్లాడని గొప్ప హీరో ఆయన. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఇంతటి స్థాయికి రావడానికి ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని మెగా స్టార్ గా మారారని చెప్పవచ్చు. అలాంటి చిరంజీవికి కార్లు అంటే చాలా ఇష్టం. మార్కెట్లోకి ఏ కొత్త టెక్నాలజీ కారు వచ్చినా తన ఇంటి ముందు ఉండాల్సిందే. అయితే చిరంజీవికి కార్లు అంటే అంత ఇష్టం ఉండడానికి ప్రధాన కారణం ఒక హీరోయినట. ఆమె చిరంజీవిని అవమానించడం వల్లే కార్లు అంటే అంత ఇష్టంగా మార్చుకున్నారు చిరంజీవి. ఆ వివరాలు ఏంటో చూద్దామా..
also read:నీకు దండం పెడతా… వైయస్ షర్మిల డైలాగ్ తో రీల్ చేసిన సురేఖ వాణి..!
Advertisement
Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో నటి మాధవితో కలిసి ఖైదీ చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ సమయంలో ఒకరోజు చిరంజీవి గారి కోసం కార్ రాలేదట. కార్ రాకపోవడంతో అదే హోటల్లో హీరోయిన్ కూడా ఉండడంతో ఇద్దరూ కలిసి ఒకే కారులో రమ్మని నిర్మాత పంపించారు. అప్పటికే కారు కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి, తన హోటల్ ముందు కార్ రాగానే మాధవి తో కలిసి వెనుక సీట్లో కూర్చున్నారట. అప్పటికే మాధవి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ పారితోషికం అందుకుంటుంది.
also read:Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?
ఇలా చిరంజీవి వెనక్కి వెళ్లి ఆమె సీట్లో కూర్చోవడంతో , వెంటనే ఆమె మీరు ముందుకు వెళ్లి కూర్చోండి ఇది నా కోసం మాత్రమే పంపిన కారు, మీరు వెళ్లి ముందు కూర్చుండి అని అందట. ఇలా మీరు నా పక్కన కూర్చుంటారా అన్నట్టు సీరియస్ గా చూసిందట. దీంతో చిరంజీవి స్వారీ చెప్పి ముందుకు వెళ్లి కూర్చున్నారట. ఇక అలాంటి అవమానం పడిన చిరంజీవి కి కార్లంటే ఇష్టపడేలా చేసిందని , మార్కెట్లోకి ఎలాంటి కొత్త కార్లు వచ్చినా ముందుగా ఆయన కొనుగోలు చేస్తారని తెలుస్తోంది.
also read:షూటింగ్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభాస్ గారి నుండి భోజనం వచ్చేది… జబర్దస్త్ మహేష్..!