చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని.. ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని.. ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర జరుగుతోంది అంటూ ఆయన భార్య భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బరువు తగ్గితే.. కిడ్నీలు ప్రమాదంలో పడతాయని అన్నారు. అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవని.. ఓవర్ హెడ్ నీటి ట్యాంక్స్ కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నాయుడు కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
“సిబిఎన్ ప్రాణాలకు హాని ఉందని, కావాలనే ఆయనకు హాని కలిగిస్తున్నారు.. ఆయన ప్రమాదంలో ఉన్నారు” అంటూ లోకేష్ పేర్కొన్నారు. దోమలు, కలుషిత నీటి వలన ఇన్ఫెక్షన్స్, అలర్జీలకు గురి అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు స్టెరాయిడ్స్ వెయ్యాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, అధికారులు దాక్కోవడమేమిటి?’’ ‘‘చంద్రబాబు నాయుడుకు ఏదైనా హాని జరిగితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అంటూ లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.
నాయుడు భార్య భువనేశ్వరి X లో మాట్లాడుతూ, “నా భర్త జైలులో ఉన్న సమయంలో అతనికి అత్యవసరంగా అవసరమైన వైద్య సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనందున, నా భర్త క్షేమం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఇప్పటికే ఆయన ఐదు కేజీల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. అని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక నారా బ్రాహ్మణి కూడా ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు నాయుడు గారు అపరిశుభ్ర ప్రాంతంలో అన్యాయంగా బంధించబడ్డారు. ఆయన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఆయన క్షేమం గురించి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరిన్ని..
అకీరా హీరో అవ్వడు అంటూ రేణు దేశాయ్ సంచలన కామెంట్స్.. కానీ అలా మాత్రం చూడాలని ఉంది అంటూ..
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు.. వైరల్ అవుతున్న రాజీవ్ కనకాల కామెంట్స్!
రవితేజ మూవీలో రేణుదేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర గొప్పదనం గురించి తెలుసా ?