Home » బాలయ్య డైరెక్షన్ చేసిన మూవీ ఆగిపోవడానికి కారణం సౌందర్యేనా..!!

బాలయ్య డైరెక్షన్ చేసిన మూవీ ఆగిపోవడానికి కారణం సౌందర్యేనా..!!

Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు చెప్పగానే తొడగొట్టి వంశం పరువు నిలబెట్టే పాత్రలే గుర్తుకొస్తాయి. ఖద్దరు బట్టల మీద నెత్తుటి మరకలు తో రెచ్చిపోయిన సన్నివేశాలే గుర్తుకొస్తాయి. తండ్రి ఎన్టీఆర్ లాగా బాలకృష్ణ కూడా దర్శకత్వం వహిస్తే చూడాలన్నది ఆయన అభిమానుల కోరిక. నేను దర్శకత్వం వహించే చిత్రం అంటే అది ఆషామాషీగా ఉండకూడదు అని చెప్తుంటారు బాలకృష్ణ. రెండు పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించే చాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారి పోయింది. బాలయ్య తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా “సామ్రాట్ అశోక్”. ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహిస్తున్నారని మొదటినుంచి అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బాలకృష్ణను దర్శకుణ్ణి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్. 1991 సెప్టెంబర్ 12 వ తేదీన ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. చివరి వరకు ప్రారంభోత్సవాన్ని రహస్యంగా ఉంచిన ఎన్టీఆర్ అసలు ఈ సినిమా ప్రారంభం అవుతుందా లేదా అని అనుమానం చిత్రపరిశ్రమలో మొదలైంది.

Advertisement

తాను అనుకున్న టైంకే షూటింగ్ ప్రారంభించారు ఎన్టీఆర్. అంతకు ముందే ఎన్టీఆర్ దర్శకత్వంలో కొన్ని సినిమాలు చేశారు బాలకృష్ణ. అతని దర్శకత్వంలో తండ్రి నటించే అపూర్వ దృశ్యం ఆ రోజు చోటు చేసుకుంది. చాణిక్యుడు గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ పై తొలి షాట్ చిత్రీకరించారు బాలయ్య. నందమూరి హరికృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఆ తర్వాత తండ్రి తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సేస్ వల్ల బాలయ్య ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. బాలకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం అలా ఆగిపోయింది. అలాగే రెండోసారి దర్శకత్వం వహించిన చిత్రం నర్తనశాల. ఈ సినిమాని కలర్లో తీయాలని బాలకృష్ణ అనుకున్నాడట. ద్రౌపది పాత్రకు సౌందర్యను ఎంచుకున్నారు. ముఖ్య పాత్రలకు నటీనటుల ఎంపిక కూడా జరిగింది.

Advertisement

 

2004 మార్చి 1వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో నర్తనశాల షూటింగ్ ప్రారంభమైంది. రాఘవేంద్రరావు తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. నర్తనశాల తొలి షెడ్యూల్ షూటింగ్ మాత్రమే జరిగింది. రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యేసరికి విజయేంద్ర వర్మ షూటింగ్ లో బాలయ్య గాయపడడం వల్ల షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత సౌందర్య గారు విమాన ప్రమాదంలో మరణించడం, తదితర కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ వారం రోజులపాటు జరిగిన సన్నివేశాల షూటింగ్ ను కూడా ఎడిటింగ్ జరిపించి 2020 అక్టోబర్ 24 న విజయదశమి నాడు ఎటువంటి ప్రచారం లేకుండా ఓటీటీ లో రిలీజ్ చేశారు బాలకృష్ణ. ఇలా బాలకృష్ణ దర్శకత్వం వహించాలని ప్రయత్నించిన రెండు చిత్రాలు కూడా పూర్తికాకుండానే,దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోకుండానే మధ్యలోనే ఆగిపోయాయి.

Visitors Are Also Reading