Home » ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న అక్కినేని అఖిల్…!

ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న అక్కినేని అఖిల్…!

by Bunty
Ad

అక్కినేని వారసుడు అఖిల్ గురించి తెలియని వారు ఉండరు. తెలిసి తెలియని వయసులోనే సినిమాలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తాను పెరిగి పెద్దయ్యాక సినిమాల్లో అంతే రాణిస్తాడని అంత అనుకున్నారు. కానీ అఖిల్ జాతకం మొత్తం తలకిందులుగా మారిపోయింది. ఇప్పటివరకు తాను ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఒక సినిమా కూడా తనకి పెద్దగా సక్సెస్ ని ఇవ్వలేకపోతోంది. ఈ క్రమంలోనే అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

Is Akhil going to undergo surgery for that part

Is Akhil going to undergo surgery for that part

ఈ సినిమాలో అఖిల్ హాలీవుడ్ హీరోలాగా హైట్, వెయిట్, పర్సనాలిటీతో అద్భుతంగా కనిపించారు. తాజాగా అఖిల్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాను ఓ కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్టుగా ఓ వార్త ఇండస్ట్రీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఎంతో అందంగా అఖిల్ ఉన్నప్పటికీ మరింత అందంగా కనిపించడం కోసం ఓ చిన్న సర్జరీ చేయించుకుంటున్నారని ఈ సమాచారం అందుతోంది. తన ముఖంలో ముక్కుకు సంబంధించి ఓ చిన్న సర్జరీ చేయించుకోబోతున్నాడట. ఇక ఈ సర్జరీ కోసం అఖిల్ విదేశాలకు వెళ్లబోతున్నాడట.

Advertisement

Advertisement

ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీవర్గాల్లో వైరల్ అవుతుంది. ఇక ఏజెంట్ సినిమా అనంతరం అఖిల్ చాలా జాగ్రత్తగా మరో సినిమాకి ఓకే చెప్పాడట. ఇక అఖిల్ నటించబోయే ఈ చిత్రానికి ఒక కొత్త దర్శకుడు అనిల్ కుమార్ అనే కొత్త వ్యక్తి దర్శకత్వం వహించబోతున్నారట. అనిల్ ఇంతకుముందు రాధేశ్యామ్, సాహో వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడట. ఇక వీరు చేయబోయే సినిమాకి ‘ధీర’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుందట. ఇక అఖిల్ ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading