Home » అమ్మో ఆకాశం నుంచి ఇనుప గోలీలు పడ్డాయట.. ఎక్కడో తెలుసా..!!

అమ్మో ఆకాశం నుంచి ఇనుప గోలీలు పడ్డాయట.. ఎక్కడో తెలుసా..!!

by Sravanthi
Ad

అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.అవి ఎలా జరిగాయి.. ఎందుకు జరిగాయి.. అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే ఈ గ్రామంలో ఎవరూ ఊహించని విధంగా ఆకాశం నుంచి ఇనుప గోలీలు పడ్డాయి… దీంతో స్థానికులంతా భయంతో వణికి పోయారు. అవి ఎలా పడ్డాయి.. ఎవరు వేశారని ఆందోళన చెందారు. ఈ విషయం కాస్త పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగి ఆ ఇనుప గుళ్లను స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించే పనిలో పడ్డారు. అయితే ఈ సంఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ దగ్గరలో చోటు చేసుకుంది. ఇక్కడి కంబో లాజ్, భూ మేల్, రాంపుర గ్రామాల్లో ఈ ఇనుప గోలీలు పడ్డాయి. ఇది ఈ నెల 12,13 తేదీల్లో పడ్డాయని, అవి కనీసం ఒకటిన్నర అడుగు వ్యాసంతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే ఇవి చైనాకు చెందినటువంటి చాంగు జింగు 3b అనేటువంటి రాకెట్.. భూవాతావరణంలోకి రీ ఎంట్రీ ఇచ్చే సమయంలో వేరు పడినటువంటి శకలాలు కావచ్చని అమెరికాకు చెందినటువంటి ఆస్ట్రోనామర్ అంటున్నారు.అయితే ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే ఇనుప గోలీలు మాత్రం ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇస్రో సహకారం తీసుకుంటున్నామని, అలాగే అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలియజేశారు.

Advertisement

ALSO READ;

Advertisement

అంద‌రికీ న‌చ్చిన ఖ‌లేజా ఎందుకు ఫ్లాప్ అయ్యింది…5 కార‌ణాలు ఇవేనా..!

అయ్యో ఆలీ.. ఆశలు అడియాశలయ్యేనా..?

 

Visitors Are Also Reading