ఆసియా కప్ లో భారత జట్టుపైన ఎన్నో అంచనాలు అనేవి ఉండేవి. కానీ వాటిని జట్టు మొత్తం నాశనం చేసింది అనే చెప్పాలి. మొదట బాగానే ఆడిన టీం ఇండియా సూపర్ 4 లో రెండు మ్యాచ్ లలో ఓడిపోయి.. దాదాపుగా బయటకు వచ్చేసింది. అయితే నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీనే అని అంటునారు ఇర్ఫాన్ పఠాన్.
Advertisement
భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ.. శ్రీలంక చేతిలో ఓడిపోవడానికి రోహిత్ చేసిన రెండు తప్పులే కారణం అని అన్నాడు. అసలు రోహిత్ అలాంటి చిన్న తప్పులు ఎలా చేస్తున్నాడో తెలియడం లేదు అని పేర్కొన్నాడు. అయితే రోహిత్ చేసిన మొదటి తప్పు దీపక్ హుడాతో బౌలింగ్ అనేది చేయించకపోవడం. నిన్న మ్యాచ్ లో వికెట్లు అన్ని స్పినర్లకే పడినప్పుడు హుడాను బౌలింగ్ ఇవ్వాల్సింది అని అన్నాడు.
Advertisement
అలాగే రోహిత్ చేసిన మరో తప్పు 19 ఓవర్ ను భవనేశ్వర్ కుమార్ తో వేయించడం అని చెప్పాడు. అసలు ఆ 19వ ఓవర్ ను అర్ధదీప్ సింగ్ తో వేయించి ఉంటె ఆఖరి ఓవర్ లో ఇండియా దగ్గర కనీసం మరో 5 పరుగులు ఎక్కువగా ఉండేవి. కానీ రోహిత్ అలా చేయలేదు. కెప్టెన్ గా రోహిత్ శర్మ చేసిన ఈ రెండు తప్పుల వల్లే భారత్ ఓడిపోయింది అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :