IPL : ఐపీఎల్ లో మొత్తం పది టీంలు ఉన్నాయి ప్రతి ఏడాది కూడా చిన్న చిన్న మార్పులతో జెర్సీలు ని రూపొందిస్తూ ఉంటారు. సరికొత్త జెర్సీలు వస్తూ ఉంటాయి. చాలా టీంలు తమ జెర్సీ లో మార్పులు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ అంటే బ్లూ, చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఎల్లో జెర్సీలు మనకి గుర్తు వస్తాయి.
Advertisement
కొన్ని టీమ్స్ మాత్రం ప్రతి ఏడాది ఒక మ్యాచ్లో తమ రెగ్యులర్ జర్నీ పూర్తి భిన్నంగా వేరే రంగులని తీసుకుంటూ ఉంటారు. 10 టీంలలో కేవలం ఐదు టీమ్స్ మాత్రమే ప్రతి సీజన్లో ఒక మ్యాచ్ ని స్పెషల్ జెర్సీతో ఆడుతూ ఉంటాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జాయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్.
అయితే ఈ ఐదు కూడా ప్రతి సీజన్లో ఒక మ్యాచ్ ని మాత్రం స్పెషల్ జర్సీతో ఆడతారు. ఎందుకు ఇలా స్పెషల్ జెర్సీలు వేసుకుంటారు..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ స్పెషల్ జెర్సీ సంప్రదాయాన్ని మొదలుపెట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెడ్ కలర్ జెర్సీలో ఆడుతుంది. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో కొత్త జెర్సీ ని లాంచ్ చేసింది కూడా. గ్రీన్ కలర్ జెర్సీలో ఆర్సిబి ఒక మ్యాచ్ ఆడనుంది. అదే గో గ్రీన్ జెర్సీ. పరిశుభ్రత పచ్చని వాతావరణం గురించి అవగాహన కల్పించడం కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రీన్ కలర్ జెర్సీలో ఆడునుంది.
Advertisement
Also read:
special jersey pic.twitter.com/axCh0qFXPO
— Sayyad Nag Pasha (@nag_pasha) April 14, 2024
Also read:
రాజస్థాన్ రాయల్స్ పింక్ ప్రామిస్ లో భాగంగా గ్రామీణ భారతదేశంలో మహిళా సాధికారత కోసం స్పెషల్ జెర్సీలో ఆడబోతోంది. లక్నో గుజరాత్ జట్టు కూడా స్పెషల్ జెర్సీలో బరిలోకి దిగబోతోంది. ఐకాన్ స్పోర్ట్స్ క్లబ్ వారసత్వాన్ని గౌరవించడానికి భారత ఫుట్బాల్ క్లబ్ గ్రీన్ జెర్సీ లో బరిలోకి దిగుతుంది. క్యాన్సర్ పై పోరాడడానికి మద్దతుగా లావెండర్ జెర్సీలో గుజరాత్ టైటాన్స్ ఆడబోతుంది. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక నగర పట్టణం ఐకానిక్ మెట్రో లైన్ ని కలిగి ఉన్న ఢిల్లీ నగర వారసత్వాన్ని ఆవిష్కరణలు నేపథ్యంలో బ్లూ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతుంది ఇలా స్పెషల్ జెర్సీల్లో ఆడనున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!