ఐపీఎల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్‌లో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను తెలుసుకోవడంలో సహాయ పడడమే కాకుండా.. ప్రతిరోజు ఒకటి లేదా రెండు నాటకీయ సంఘటనలు చూసే వారి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 189/9 స్కోర్ చేయగా.. గుజరాత్ టైటాన్స్ కూడా పరుగులను మెరుగుగానే ప్రారంభించింది. మాథ్యూవేడ్‌ను ప్రారంభంలోనే కోల్పోయినప్పటికీ నెంబర్ 3 బ్యాటర్ ఆరంగేట్రం సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు సుదర్శన్.
Advertisement
Advertisement
ఇతను టాయిలెట్ బ్రేక్ తీసుకున్నప్పటికీ అతని కోసం మొత్తం ఆటగాళ్లు వేచి ఉండడంతో అతికి కొంచెం ఇబ్బందికరమైన క్షణం ఎదురైందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ విషయాన్ని ఆకాశవాణి వ్యాఖ్యాతలు ధృవీకరించారు. ఓ ఓవర్ తరువాత వ్యూహాత్మక సమయం ముగిసిందంటే గేమ్ ప్రొసీడింగ్స్‌లో మరింత ఆలస్యం అయింది.
చివరికి ఆ మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ విజయం సాధించింది. ముఖ్యంగా చివరి రెండు బంతులకు రెండు సిక్స్‌లు కొట్టి రాహుల్ తెవాటియా మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా శుబ్‌మన్ గిల్ కూడా 96 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు.
#PBKSvsGT Sai Sudharsan #IPL2022 pic.twitter.com/8bulxM0i2f
— Big Cric Fan (@cric_big_fan) April 8, 2022