ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏమాత్రం ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్ ప్రారంభమైతే చాలు అందరూ… ఆ మ్యాచ్లను చూసేందుకే ఆసక్తి చూపిస్తారు. ఇక 2023 ఐపీఎల్ సీజన్ మరో మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులంతా టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతుంటారు.
Advertisement
అయితే ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్ లు చూడాలంటే సబ్ స్క్రిప్షన్ కింద కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. దీంతో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికే ప్రసారాలు చూసే అవకాశం ఉండేది. కానీ ఈసారి ఉచితంగా ఐపీఎల్ ప్రసారాలను అందించేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకున్న రిలయన్స్, ఐపిఎల్ మ్యాచ్ ప్రసారాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేసే యోచన చేస్తున్నట్లు ‘ది హిందూ బిజినెస్ లైన్’ తన కథనంలో పేర్కొంది.
Advertisement
అదే జరిగితే రిలయన్స్ నుంచి మరో సంచలనమనే చెప్పాలి. 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి డిజిటల్ మీడియా హక్కులను రిలయన్స్ వెంచర్స్ లో ఒకటైన వయా కామ్ 18 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలే ఫిఫా వరల్డ్ కప్ ను జియో సినిమా యాప్ లో ఉచితంగా ప్రసారం చేసిన రిలయన్స్, అదే స్ట్రాటజీని ఐపీఎల్ మ్యాచ్ ల విషయంలోను అనుసరించాలని భావిస్తున్నట్లు సమాచారం.
read also : రోజా పై విరుచుకుపడిన చిరంజీవి..మొన్న నా ఇంటికి వచ్చి ఈ రోజు నా వెనుక చేరి !