ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే, ఎటువంటి అంచనాలు లేకుండా గతేడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఛాంపియన్ గా అవతరించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ప్లేయర్ల ఆట తోడవడంతో 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఎదురే లేకుండా పోయింది.
READ ALSO : Manchu Manoj-Manchu Vishnu : మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి.. వీడియో షేర్ చేసిన హీరో
Advertisement
ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెడుతున్న గుజరాత్ టైటాన్స్ మరోసారి ఛాంపియన్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2022 సీజన్ ముంబై ఇండియన్స్ కు పీడకల లాంటిది. కీలక ప్లేయర్లను కోల్పోయిన తర్వాత కొత్త జట్టుతో ముంబై ఆశించిన స్థాయిలో రాణించలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఈసారి మాత్రం ముంబై మరోసారి ఛాంపియన్ ఆటను ప్రదర్శించే అవకాశం ఉంది. గత సీజన్ లో త్రుటిలో టైటిల్ ను చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఐపీఎల్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. గుజరాత్ టైటాన్స్ మాదిరే జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. సంజు సామ్సన్ కెప్టెన్సీ లోని రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది.
Advertisement
READ ALSO : పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!
ఇక ఈ ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ డార్క్ హార్స్ గా బరిలోకి దిగుతోంది. గత సీజన్ లో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అనంతరం జట్టును పూర్తిగా మార్చేసింది. యువ ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పింది. వేలంలో మయాంక్ అగర్వాల్, హ్యరి బృక్, క్లాసెన్, అదిల్ రషీద్ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఇక బౌలింగ్ భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ లతో పటిష్టంగా ఉంది. డార్క్ హార్స్ గా బరిలోకి దిగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఎవరు ఊహించని విధంగా ఐపిఎల్ 16వ సీజన్ టైటిల్ ను గెలిచే అవకాశం లేకపోలేదు.
READ ALSO : NTR 30 : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. అస్సలు తగ్గట్లేదుగా…!