ఐపీఎల్-2022 లో రెండు కొత్త టీమ్‌లు రానున్న విషయం తెలిసిందే. అందులో కొత్త టీమ్ అయినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ తమ లోగోను తాజాగా విడుదల చేసినది. లోగోలో గరుడ పక్షి రెక్కల ఆకారంలో డిసైన్ చేసి దానికి కింద లక్నో సూపర్ జెయింట్స్ అని రాసారు. గరుడ పక్షి ప్రతి భారతీయ సంస్కృతిలో భాగం అని ఒక ప్రకటనలో వెల్లడించినది. గరుడ పక్షి రెక్కలు మూడు రంగులలో ఉండగా.. క్రికెట్ ఆటను సూచించడానికి పక్షి శరీరం నీలం రంగు బ్యాట్‌తో తయారు చేయబడింది. నారింజ రంగు సీమ్‌తో ఎరుపు బండి ఉన్నది. ఇది శుభప్రదమైన జయ్ తిలకం లాంటిది అని జోడించారు.
Advertisement
ఐపీఎల్ 2022 కోసం కే.ఎల్ రాహుల్ రూ.17కోట్లకు, మార్కస్ స్టోయినిస్ 9.2కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4కోట్లుతో కొనుగోలు చేసింది. లక్నో జెయింట్స్ కెప్టెన్‌గా కే.ఎల్.రాహుల్ వ్యవరించనున్నాడు. అదేవిధంగా ఆండి ప్లవన్ ఇప్పటికే లక్నో ప్రాంఛైజీకి కోచ్‌గా ఎంపిక అయ్యాడు. భారత మాజీ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ ఫ్రాంచైజీకి మెంటర్‌గా వ్యవహరిస్తాడు.
Advertisement