వేసవి కాలం వచ్చిందంటే ఐపీఎల్ అభిమానుల ఆనందం మామూలుగా ఉండదు. గత సంవత్సరం వరకు ఎనిమిది టీమ్‌లు మ్యాచ్‌లు ఆడగా.. ఈ ఏడాది నుంచి ఐపీఎల్ లో 10 టీమ్‌లు పాల్గొంటున్నాయి. అయితే కొత్తగా వచ్చినటువంటి గుజరాత్ టైటాన్స్ తమ జెర్సీని ఆవిష్కరించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా, బీసీసీఐ కార్యదర్శి జైషా, జట్టు ఇతర అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ పాటు గుజరాత్ కూడా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.
Also Read : Womens World Cup 2022 : ఇంగ్లండ్ పై దక్షిణాఫ్రికా అద్భుత విజయం
ఈ తరుణంలో మార్చి 28న నూతన జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనున్నది. ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముచ్చటించారు. బౌలింగ్ చేస్తారా..? లేదా అన్న ప్రశ్నకు బదిలిస్తూ.. సర్ అది సర్‌ప్రైజ్.. సర్‌ప్రైజ్‌లాగే ఉండనివ్వండి అంటూ సమాధానం దాటవేశాడు. ముఖ్యంగా కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ విజయాలు జట్టువి.. అపజయాలు నావి అని పేర్కొన్నాడు.
జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్లకు స్వేచ్ఛను ఇచ్చి వారి ప్రతిభను ఉపయోగించుకోవడమే ముఖ్యం. ఈ విషయంలో పూర్తి స్పష్టత, నిజాయితితో ఉండాలి. అంతా బాగున్న సమయంలో వారికి మద్దతు అవసరం లేదు. కష్టసమయాల్లో మాత్రం వెన్నుతట్టి ప్రోత్సాహించినప్పుడే మంచి ఫలితాలు రాబట్టగలం. అంతా కెప్టెన్ మీదే ఆధారపడి ఉంటుందని హార్దిక్ చెప్పుకొచ్చాడు. గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యాను మెగా వేలానికి ముందే రూ.15కోట్లు చెల్లించి గుజరాత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసినదే.
Also Read : ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీరే..!