మహిళల వన్డే ప్రపంచ కప్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు మరొక పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో వరుసగా మూడవ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలై.. క్వార్టర్స్ చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా, వెస్టిండిస్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ ఇవాళ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా 3 వికెట్ల తేడాతో పరాజయం పాలై మరొకసారి భంగ పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి దక్షిణాఫ్రికా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ బ్యూమెంట్ (62) వికెట్ కీపర్ జోన్స్ (53) అర్థ శతకాలతో రాణించడంతో నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్ కాప్ (5/45) ఇంగ్లండ్ పతానాన్ని శాసించింది.
Advertisement
Ad
Advertisement
ఆ తరువాత 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ లిజెల్లే లీ (09) వికెట్ కోల్పోయినప్పటికీ లారా వొల్వార్డ్ (77) తజ్మిన్ బ్రిట్స్ (23) కెప్టెన్ సూన్‌లుస్ (36) మరిజన్నె కాప్ (32)ల బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్‌ల కారణంగా మరొక నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. చివరిలో త్రిషచెట్టి (11) షబ్రిమ్ ఇస్మాయిల్ (5) మరొక వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా ముందుకు నడిపించారు.
ముఖ్యంగా ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన కాప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఇంగ్లండ్ పై ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో ఆసీస్ ఉండగా.. టీమిండియా మూడవ స్థానంలో, ఆ తరువాత న్యూజిలాండ్ వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఓడిన పాక్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
Also Read : ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీరే..!