Telugu News » Blog » ఐపీఎల్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు ప‌ట్టింది వీరే..!

ఐపీఎల్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు ప‌ట్టింది వీరే..!

by Anji
Ads

ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసిన క్యాచ్‌ల‌ను నేల పాలు చేస్తే క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతుంది. బౌండ‌రీకి వెళ్లే బంతిని ఆపి ఒక్క ప‌రుగే తీస్తే అది సూప‌ర్ ఫీల్డింగ్ అంటాం క‌దా.. అలాగే దూరంగా వేగంగా గాల్లోకి లేచిన బంతిని ఒడిసి ప‌ట్టుకుంటే సూప‌ర్ క్యాచ్ అవుతుంది. ఒకే ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ రూపు రేఖ‌లు మారిపోయిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఈనెల 26న ఐపీఎల్ 15వ సీజ‌న్ ప్రారంభం కానున్న త‌రుణంలో ఇప్ప‌టి వ‌ర‌కు లీగ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక క్యాచ్‌ల‌ను ప‌ట్టిన ఆట‌గాళ్లు ఎవ‌రో ఒక‌సారి చూద్దాం.

Ads

సురేష్ రైనా 

భార‌త క్రికెట్ గొప్ప ఫీల్డ‌ర్ల‌లో ఒక‌డు సురేష్ రైనా. ఐపీఎల్‌లో 102 మ్యాచ్‌లు ఆడి 104 క్యాచ్‌లు ప‌ట్టాడు. ఈ మెగా టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక క్యాచ్ లు ప‌ట్టిన ఆట‌గాడు రైనానే. ఐపీఎల్‌లో సుదీర్గ‌కాలం పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ఆడిన రైనాను ఈ ఏడాది ఫ్రాంచైజీ కొనుగోలు చేయ‌లేదు. అయితే ఈ సీజ‌న్‌లో కొత్త‌గా చేరిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు ఆట‌గాడు జాస‌న్ రాయ్ లీగ్ ప్రారంభం కాక‌ముందే వైదొలిగాడు. ఈ త‌రుణంలో రైనాను తీసుకున్న‌ట్టు వార్త‌లు వినిపించాయి. ఇటీవ‌లే ఆప్ఝాన్ ఆట‌గాడిని తీసుకుంటున్న‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ ప్ర‌క‌టించింది

పోరాల్డ్

Ads

పొడుగుగా ఉండే ముంబై ఇండియ‌న్స్ ఆల్ రౌండ‌ర్ కీర‌న్ పోలార్డ్ ఎక్కువ‌గా లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఈ ఆట‌గాడు బౌండ‌రీ లైన్ వ‌ద్ద‌కు వ‌చ్చినా.. ఏ క్యాచ్ వ‌ద‌ల‌డు. ఎన్నోసార్లు బౌండ‌రీల‌కు వెళ్లే బంతుల‌ను ఒంటి చేత్తే ప‌ట్టి ఆశ్చ‌ర్య ప‌రిచాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో పోలార్డ్ ఇప్ప‌టి వ‌ర‌కు 90 క్యాచ్‌లు ప‌ట్టాడు.

రోహిత్ శ‌ర్మ

ముంబ‌యి ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎక్కువ‌గా స‌ర్కిల్ లోప‌ల ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఇప్ప‌టివ‌ర‌కు 207 ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఆడిన హిట్ మ్యాన్ 89 క్యాచ్‌ల‌ను ప‌ట్టుకున్నాడు. ఇత‌ని సారథ్యంలోనే ముంబ‌యి 5 సార్లు ఛాంపియ‌న్ గా నిలిచి రికార్డు సృష్టించింది.

ఏబీ డివిలియ‌ర్స్


ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్త‌మ ఫీల్డ‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియ‌ర్స్ ఒక‌డు. ఐపీఎల్‌లో చాలా కాలంగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున ఆడిన మిస్ట‌ర్ 360.. ఈ లీగ్‌లో 120 ఇ్న్నింగ్స్‌ల‌లో 83 క్యాచ్‌లు అందుకున్నాడు. గ‌త సీజ‌న్ తోనే త‌న ఐపీఎల్ కెరీర్‌కు కూడా రిటైర్ మెంట్ ఇచ్చాడు.

శిఖ‌ర్ ధావ‌న్

ఐపీఎల్‌లో ఢిల్లీ డెర్‌డేవిల్స్ – ముంబై ఇండియ‌న్స్‌- స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌ల‌కు ఆడిన శిఖ‌ర ధావ‌న్‌, 2019 నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడాడాఉ. ఈ022 సీజ‌న్ కోసం పంజాబ్ జ‌ట్టు అత‌న్ని తీసుకుంది ఇప్ప‌టివ‌ర‌కు 184 ఇన్నింగ్స్‌ల‌లో ధావ‌న్ 81 క్యాచ్‌ల‌ను ప‌ట్టాడు.

Ad

Also Read :  పూజాహెగ్డే న‌టించిన మూడు సినిమాల్లో ఉన్న ఒకే కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?