గత ఏడాది ఐపీఎల్ తరువాత క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏబీడీ మరొకసారి ఆర్సీబీతో జతకట్టనున్నాడని సమాచారం. అయితే ఈసారి క్రికెటర్‌గా కాకుండా జట్టు మెంటార్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం చేసుకున్నాడని ఆర్సీబీ అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
Advertisement
ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆర్సీబీ తమ నూతన సారథి పేరును ఇప్పటివరకు ప్రకటించలేదు. కెప్టెన్ రేసులో డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి మాత్రం క్లారిటీ లేదు. మార్చి 12న ఓ సర్‌ఫ్రైజ్ ఉందంటూ ఫ్రాంచైజీ యాజమాన్యం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ కెప్టెన్ అంశం కొలిక్కి వచ్చేది లేనిది అనుమానమే. మరొక వైపు జట్టుకు సంబంధించి జెర్సీని, లోగోను మార్చనున్నారని తెలుస్తోంది.
Advertisement
Also Read : Women World Cup 2022: మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న జోడి..!