ఒక సినిమాను తెరకెక్కించాలంటే మంచి లొకేషన్ లు ఉండాలి. అక్కడ ఎలాంటి డిస్టబెన్స్ ఉండకూడదు. అంతే కాకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. అలాంటి లొకేషన్ లు మరియు వసతులు ఉండటం కోసమే స్డూటియోలను నిర్మించారు. ఇక మన హైదరాబాద్ లో అప్పట్లో నిర్మించిన స్డూడియోలలో అన్నపూర్ణ స్డూడియో, రామానాయుడు స్టూడియోతో పాటూ మరికొన్ని ఉన్నాయి. ఈ స్టూడియోలు కూడా దాదాపు సినిమా వాళ్లవే…ఇదిలా ఉంటే రామానాయుడు స్టూడియోను నిర్మాత డి. రామానాయుడు నిర్మించిన సంగతి తెలిసిందే.
Advertisement
అయితే ఈ స్టూడియో నిర్మాణానికి ముందు కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. మద్రాసు నుండి చిత్రపరిశ్రమ షిఫ్ట్ అవుతోంది. ఆ సమయంలో సీఎంగా జలగం వెంకటరావు ఉన్నారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావుకు స్టూడియో నిర్మాణం కోసం బంజారా హిల్స్ లో స్థలాన్ని కేటాయించారు. అప్పుడే నిర్మాత డి రామానాయుడిని కూడా స్థలం కావాలా అని అడిగారట. కానీ రామానాయుడు వద్దన్నారట. దానికి కారణం ఆయన విజయప్రొడక్షన్స్ లో సినిమాలు చేస్తూ వారి స్టూడియోనే తన స్టూడియో అనుకున్నారట.
Advertisement
కాగా రామానాయుడు సెక్రటరీ సినిమాను అన్నపూర్ణ స్టూడియోలో తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న మొదటి సినిమా ఇదే….ఈ సినిమా విడుదల సమయంలో వచ్చిన నిర్మాత నాగిరెడ్డి ఇక్కడ కొండల్లో స్టూడియో కడితే బాగుంటుందన్నారట. అప్పుడు రామానాయుడికి అక్కడ స్టూడియో కట్టాలనే ఆలోచన మొదలయ్యింది. ఆ తరవాత భవనం వెంకట్రావ్ సీఎంగా ఉన్పప్పుడు రామానాయుడికి స్టూడియో కోసం స్థలాన్ని కేటాయించారు. ఒకరోజు ఆస్థలం చూసిన ఎన్టీరామారావు ఈ రాళ్లల్లో ఏం స్టూడియో కడతావు అంటూ ప్రశ్నించారట.
దానికి రామానాయుడు వ్యూ భాగుందని చెప్పారట. దాంతో ఎన్టీఆర్ వ్యాపారం చేసుకుంటావా.? వ్యూ చూస్తూ కూర్చుంటావా. ఇక్కడ ఎవరు సినిమాలు తీస్తారని నవ్వుతూ అన్నారట. కానీ రామానాయుడు ఆ మాటలను పట్టించుకోలేదట. ఇక ఆ తరవాత రామానాయుడు స్టూడియో పనులు మొదలు పెట్టారు. రాళ్లను బద్దలు కొట్టడానికే నెలల సమయం పడుతోంది. నిరాశలోకి వెళ్లిపోయారు. ఇక అప్పటికే సురేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం వెంకటేష్ కూడా సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించడంతో అలా సంపాదించింది అంతా స్టూడియో మీదనే ఖర్చు చేశారు. కానీ చివరికి అన్ని సౌకర్యలతో స్టూడియోను నిర్మించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ALSO READ :
కేజీఎఫ్ చాప్టర్-3 పై అయ్యప్ప శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…అందుకే తాను బతికున్నా అంటూ…!
వర్షం తో వచ్చిన లాభాలు వాన తో పోగొట్టుకున్న ఎమ్ఎస్.రాజు…. ఆ నిర్ణయమే కొంపముంచింది…!