తెలుగు సినీ ప్రేమికులకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత… మెగాస్టార్ చిరంజీవి డాటర్ శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీజ ఇప్పటివరకు మూవీలలో నటించకపోయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి డాటర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక సమంత నాగ చైతన్య హీరోగా రూపొందినటువంటి ఏం మాయ చేసావే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చి తన అందంతో, నటనతో, టాలెంట్ తో వరుస అవకాశాలను దక్కించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది.
Advertisement
ప్రస్తుతం కూడా సమంత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానంలో కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే సమంత కొంతకాలం క్రితమే నాగచైతన్యను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అలాగే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్న విషయం కూడా మనకు తెలిసిందే. సమంత… నాగ చైతన్య విడిపోవడానికి ప్రధాన కారణం సమంత పర్సనల్ డిజైనర్ అయినటువంటి ప్రీతమ్ జుకల్కర్ కారణం అని అప్పట్లో అనేక వార్తలు బయటకు వచ్చాయి.
Advertisement
అలాగే సమంత మరియు ప్రీతమ్ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే శ్రీజ కూడా విడిపోవడానికి ఇతనే కారణం అని కూడా వార్తలు వచ్చాయి. అలాగే శ్రీజ… ప్రీతమ్ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వీరిద్దరూ కూడా ప్రస్తుతం ప్రీతమ్ ను దూరం పెట్టినట్టు తెలుస్తోంది.
ఈరోజు ఈ ప్రముఖ డిజైనర్ పుట్టిన రోజు దానితో ఇతని స్నేహితులు, బంధువులు ఎంతో మంది ఇతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే వాటిని ఇతను కూడా రీ పోస్ట్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. సమంత, శ్రీజ ఇద్దరు కూడా ఇతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు. అలాగే ఈ డిజైనర్ కూడా వారికి ఎలాంటి అభినందనలు తెలియజేయలేదు. దానితో ప్రస్తుతం వీరిద్దరూ ఈ పర్సనల్ డిజైనర్ ను దూరం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.