రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించాడు. ఇక భారీ బడ్టెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్ రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ లు నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్, శ్రీయ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
Advertisement
ఇక ఈ సినిమా కథను జక్కన్న స్వాతంత్య్రానికి పూర్వం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దాంతో సినిమాలో అప్పటి పోరాటసన్నివేశాలను భారీగా చిత్రీకరించారు. సినిమాలోని యాక్షన్ సీన్లన్నీ ఓ రేంజ్ లో చిత్రీకరించారు. ఇక కొన్ని సీన్లలో ఎన్టీఆర్ బైక్ పై వెళితే రామ్ చరణ్ గుర్రంపై దూసుకువెళుతుంటాడు. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.
Advertisement
సినిమాలో రామ్ చరణ్ దూసుకువెళ్లే గుర్రమే అసలు నిజమైంది కాదట. అది గుర్రం బొమ్మ మాత్రమే అంతే కాకుండా ఆ తరవాత గ్రాఫిక్స్ ను వాడి చరణ్ గుర్రం పై దూసుకువెళుతున్నట్టు చూపించారు. ఇక ఈ వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అది ఉత్తిత్తి గుర్రమా ఇంకా నిజమైన గుర్రం అనుకున్నామే అంటూ అవాక్కవుతున్నారు.
ఇదిలా ఉంటే నిజానికి రామ్ చరణ్ గుర్రాన్ని తోలడంలో ఎంతో నైపుణ్యం గలవాడు అన్న సంగతి తెలిసిందే. చరణ్ మగధీర సినిమాలో గుర్రం చేసిన సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా గుర్రాల స్వారీ అంటే ఎంతో ఇష్టపడే రామ్ చరణ్ కు సొంతంగా గుర్రాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం గుర్రాన్ని వాడకుండా ఎందుకు గ్రాఫిక్స్ వాడారన్నది తెలియాల్సి ఉంది.
Also read : ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?