Home » NIHARIKA KONIDELA : నిహారిక మిస్ చేసుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా…ఆ సినిమా చేసుంటే.!

NIHARIKA KONIDELA : నిహారిక మిస్ చేసుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా…ఆ సినిమా చేసుంటే.!

by AJAY
Ad

మెగాడాట‌ర్ నిహారిక గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన న‌టిగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం నిహారిక ఒక్క‌రే. సినిమాల్లోకి రాక‌ముందు నిహారిక ఈటీవీలో ప్ర‌సార‌మయ్యే ఢీ జూనియ‌ర్స్ డ్యాన్స్ షో ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ షోలో యాంక‌ర్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. నాగ‌బాబు కూడా బుల్లితెర‌పై స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.

niharika konidela

niharika konidela

కానీ నిహారిక బుల్లి తెర‌పై యాంక‌ర్ గా ప్ర‌శంస‌లు అందుకున్న త‌ర‌వాత న‌టిగా ప‌రిచ‌యం అయ్యింది. మొద‌ట వెబ్ సీరీస్ లు నిర్మిస్తూ అందులో న‌టించి ఆక‌ట్టుకుంది. ఇక నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ఒక‌మ‌న‌సు సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది. కానీ సినిమాలో నిహారిక మాత్రం త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతో పాటూ సూర్య‌కాతం అనే సినిమాలో కూడా న‌టించింది.

Advertisement

Advertisement

ఈ సినిమా కూడా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు. అయితే నిహారిక త‌న కెరీర్ లో ఓ సూప‌ర్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసింది. ఈ సినిమా చేసుంటే వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుని ఉండేది. ఆ సినిమా మ‌రేదో కాదు. రామ్ కీర్తి సురేష్ హీరోహీరోయిన్ లు వ‌చ్చిన నేను శైల‌జ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాల కీర్తి సురేష్ న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ల‌భించింది. అయితే ఈ సినిమా కోసం మేక‌ర్స్ మొద‌ట నిహారిక‌నే సంప్ర‌దించారు.

కానీ నిహారిక అప్ప‌టికీ హారోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌లేద‌ట‌. అదే స‌మయంలో హీరోయిన్ న‌టిస్తాన‌ని త‌న పేరెంట్స్ ను ఒప్పించే ప‌నిలో ప‌డింద‌ట‌. అయితే అప్పుడే నో చెప్ప‌కుండా మేక‌ర్స్ తో ఒక నెల స‌మ‌యం అడిగింద‌ట‌. వాళ్లు కూడా నిహారిక కోసం వెయిట్ చేశారు. కానీ ఒక‌నెల త‌ర‌వాత నిహారిక ఎలాంటి స‌మాధానం ఇవ్వక‌పోవ‌డంతో అప్పుడు కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని నిహారిక స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు.

Visitors Are Also Reading