Home » న‌మ్ర‌త తండ్రి ఓ స్టార్ క్రికెట‌ర్ అన్న సంగ‌తి తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

న‌మ్ర‌త తండ్రి ఓ స్టార్ క్రికెట‌ర్ అన్న సంగ‌తి తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ కలిసి ఉన్న వాళ్ళని మాత్రం వేళ్లపైన లెక్కపెట్టవచ్చు. కాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మహేష్ బాబు వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్ నమ్రతను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం అయిన‌ప్ప‌టికీ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు.

Advertisement

మహేష్ బాబును, పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఫ్యామిలీ ఉమెన్ గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదట నమ్రతతో పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ నో చెప్పారట. దానికి కారణం మహేష్ బాబుకు ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేయాలని కృష్ణ అనుకున్నారట‌. ఇక్కడి పద్ధతులు కట్టుబాట్లు తెలిసి ఉంటాయి కాబట్టి తెలుగు అమ్మాయి అయితే బెటర్ అని కృష్ణ అభిప్రాయపడ్డారట. కానీ మహేష్ బాబు నమ్రతను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంతో కృష్ణ సైతం అంగీకరించక తప్పలేదు.

Advertisement

ఆ తర్వాత ఇద్దరినీ చూసి కృష్ణ కూడా సంతోషించేవరాట. ఇది ఇలా ఉంటే నమ్రత గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… నమ్రత మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. 1977 జనవరి 22న ముంబైలో జన్మించింది. నమ్రత శిరోద్కర్ తండ్రి నితిన్ శిరోద్కర్ అప్పట్లో క్రికెటర్ గా రాణించారు. ముంబై తరఫున ఆడే దేశ వాలి క్రికెట్ లో న‌మ్ర‌త‌ తండ్రి ఎంతో పేరు సంపాదించుకున్నారు.

దిలీప్ వెంగాసర్కార్…. సునీల్ గ‌వాస్క‌ర్ లాంటి స్టార్ క్రికెటర్లతో సైతం నితిన్ శిరోద్క‌ర్ క్రికెట్ ఆడేవారట. ఆయన ఆట తీరు చూసి తోటి క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయేవారట. అంతేకాకుండా క్రికెట్ లో ఆయన అద్భుతమైన బౌలర్ గా రాణించారు. ఇక న‌మ్ర‌త‌ తల్లి కూడా కూడా సెలబ్రిటీలు అన్న విషయం చాలామందికి తెలియదు. నమ్రత తల్లి సైతం మోడల్ గా రాణించారు. నమ్రత కూడా ఒకప్పుడు మోడలింగ్ లో పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా మిస్ యూనివర్స్ పోటీలకు సైతం నమ్రత ఎంపికయ్యారు. మిస్ యూనివర్స్ గా 5వ స్థానంలో నిలిచారు.

Visitors Are Also Reading