Home » అల్లు అర్జున్ దెబ్బ‌కు తుఫాన్ లో కొట్టుకుపోయిన మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ సినిమాలు ఏవో తెలుసా..!

అల్లు అర్జున్ దెబ్బ‌కు తుఫాన్ లో కొట్టుకుపోయిన మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ సినిమాలు ఏవో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్, అల్లు అర్జున్ లు కూడా ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కు ప్ర‌భాస్, మ‌హేశ్ ల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ ఒక‌ప్పుడు అల్లు అర్జున్ కు కాస్త త‌క్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అల్లు అర్జున్ సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తేనే ప్రేక్ష‌కులు థియేట‌ర్ కు వ‌చ్చేవారు.

Advertisement

కానీ మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ సినిమాల క‌థ వేరేలా ఉండేది. సినిమా ఎలా ఉన్నా కూడా ఫ‌స్ట్ డే తో పాటూ ఒక వారం పాటూ క‌లెక్ష‌న్స్ వ‌చ్చేవి.

ఈ నేప‌థ్యంలోనే 2004 స‌మ్మ‌ర్ బ‌రిలోకి ఈ ముగ్గురు హీరోలు దిగారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో ఆర్య సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మే 7న విడుద‌లై స‌మ్మ‌ర్ బ‌రిలో నిలిచింది. ఇక అదే స‌మయంలో మే 14వ తేదీన మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన నాని సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. డిఫ‌రెంట్ క‌థ తో వ‌చ్చిన ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రం మొద‌టి షో తోనే ఫ్లాప్ టాక్ ను మూట గ‌ట్టుకుంది.

Advertisement

ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు తీవ్రంగా నిరాశ చెందారు. నాని సినిమా ఫ్లాప్ అవ‌డంతో ఆ సినిమా ఆడుతున్న థియేట‌ర్ ల‌లో కూడా తొల‌గించి అల్లు అర్జున్ ఆర్య సినిమాను వేశారు. మరోవైపు ఈ రెండు సిన‌మాల త‌ర‌వాత మే 21వ తేదీన ప్ర‌భాస్ హీరోగా న‌టించిన అడ‌విరాముడు సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. అప్ప‌టికే ప్ర‌భాస్ వ‌ర్షం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. వ‌ర్షం సినిమాతో ప్ర‌భాస్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

ఈ నేప‌థ్యంలో అడ‌విరాముడు సినిమా స‌మ‌యంలో ప్ర‌భాస్ కు ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. థియేట‌ర్ ల వ‌ద్ద భారీ క‌టౌట్ లు ద‌ర్శ‌నం ఇచ్చాయి. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ మూట గ‌ట్టుకుంది. మ‌రోవైపు ఆర్య రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా ప్రేక్ష‌కుల మ‌నసు దోచుకుంది. దాంతో అడ‌విరాముడు ఆడుతున్న థియేట‌ర్ ల‌లో కూడా ఆ సినిమాన‌ను తొల‌గించి ఆర్య సినిమాను ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమా త‌ర‌వాత‌నే అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.

ALSO READ : మ‌హేష్ బాబు సినిమా యాడ్స్ కి డ‌బ్బింగ్ చెప్పే జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading