సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాలంటే కేవలం బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సరిపోదు. స్వశక్తితో ముందుకు ఎదగాలి. పైకి ఎదుగుతున్న ప్రతీసారి కింద పడేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. జయపజయాలు తట్టునిబడడం అంటే సర్వ సాధారణ విషయం కాదు. ఒకప్పడు ఎంతో క్రేజ్ ఉన్న హీరో ఒక్కసారిగా అట్టడుగు స్థాయికి పడిపోయి, మళ్లీ పైకి ఎదగడం అంటే మాటలు కాదు. అలాంటి కోవకు చెందిన హీరో సుమన్. టాలీవుడ్‌లో ఒకప్పుడు సుమన్‌కు ఎంతో మంచి పేరు ఉండేది. ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ మెప్పించి అమ్మాయిల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో సుమన్ అని అనడంలో అతిశయోక్తి లేదు.
Also Read : సీరియల్స్ లో వాడేసిన చీరలను ఏం చేస్తారో తెలుసా..!
చాలా మందికి సుమన్ అసలు పేరు తెలియదు. అందరికీ సుమన్‌గానే పరిచయం. కానీ అసలు పేరు సుమన్ తల్వార్. స్వతహాగా సుమన్ మాతృభాష తెలుగు కాకపోయినా కానీ ఎంతో స్పష్టంగా, అచ్చమైన తెలుగులో మాట్లాడేవాడు. అందుకేనేమో తెలుగు ప్రజలు ఆయనను అక్కన చేర్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు సినిమా అవకాశాల కోసం కష్టపడే సమయంలో హీరో భాను చందర్ మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్ధరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. అదేవిధంగా వీరిద్దరికీ మార్షల్ ఆర్ట్స్ పై మంచి పట్టుంది. తొలుత సినిమాల్లో నటించే అవకాశం భానుచందర్‌కు వచ్చింది. ఆ తరువాత సుమన్‌ను సినిమాల్లో రికమెండ్ చేయడం జరిగింది.
అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. వీరు నటించిన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌ను విస్తృతంగా ఉపయోగించేవారు. ఆ తరువాత తరంగిణి సినిమాతో పాటు యువతను ఉద్దేశించిన నేటి బాలలు, దేశంలో దొంగలు పడ్డారు వంటి చిత్రాల్లో నటించి టాప్ రేంజ్ కి వెళ్లాడు.న ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా పోటీపోటీగా సుమన్ సినిమాలు ఆడేవి. ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్లుతున్న సుమన్‌కు ఓ కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది.
Nee లి చిత్రాల కేసులో సుమన్ పేరు తెరమీదకు రావడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో బెయిల్ కూడా దొరకక కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఆయన జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన జైలు జీవితం గడపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అదేవిధంగా సినీ పరిశ్రమ కూడా ఆశ్చర్యానికి గురైనది. సుమన్ కూడా బాగా కృంగిపోయాడు. జైలు నుంచి మళ్లీ తిరిగి బయటకు వచ్చాక సినిమా ఛాన్స్‌లు రాక, పరువు, ప్రతిష్ట మంట కలిసిపోవడంతో తేరుకోలేని డిప్రెషన్ లో పడిపోయాడు. ఆ తరువాత పెళ్లి అనే బంధంతో శిరీష రూపంలో మళ్లీ అదృష్టం తలుపుతట్టింది.
గుండమ్మ కథ, బడి పంతులు, రాముడు, భీముడు, యమగోల, కారు దిద్దిన కాపురం వంటి ప్రముఖ చిత్రాలు రచించిన ప్రముఖ రచయిత డీవీ సరసరాజు తన మనుమరాలును హీరో సుమన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ప్రముఖ రచయిత, సుమన్‌ను పిలిచి మరీ మనవరాలిని ఇవ్వడంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యానికి గురైంది. అప్పుడే అందరిలో ఆలోచన మొదలైంది. సుమన్ చెడ్డవాడు అయితే రాజుగారు పిలిచి మరి పిల్లను ఎందుకిస్తాడనే అనుమానం కలిగింది. పెళ్లి తరువాత సుమన్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
ముఖ్యంగా పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, అబ్బాయిగారి పెళ్లి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడు. ఆ తరువాత అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరుని పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో సుమన్ పాత్ర అమోఘం. ఈ సినిమా వల్లే సుమన్‌కి మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చాయి. ఆ తరువాత శ్రీరాముడు సినిమాలో రాముని దొరకడం సుమన్‌కు ప్లస్ అయింది. ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్రలో నటించి, తనలోని మరొక యాంగిల్ యాంగిల్‌ను కూడా ప్రేక్షకులకు చూపించాడు. సుమన్ కెరీర్ మలుపు తిరిగి విజయానికి చేరువలో నడవడానికి కారణం ఆయన సతీమణి శిరీష. పెళ్లి అనే బంధం సుమన్ జీవితాన్ని మార్చేసింది. వీరికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు అఖిలాజా ప్రత్యూష తన కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఎటువంటి అభ్యంతరం లేదని సుమన్ తెలిపారు. ప్రస్తులం తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు సుమన్.
Also Read : సీఎంతో భేటీ తరవాత మీడియాతో స్టార్స్ ఏమన్నారంటే..!