Home » ఆర్ఆర్ఆర్ నుంచి ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్‌..!

ఆర్ఆర్ఆర్ నుంచి ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్‌..!

by Sravan Sunku
Ad

టాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నచిత్రం గురించి అందరికీ తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ తెరకెక్కించారని తెలుస్తోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ అయిన ఒలివియా మోరీస్ హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు.

Advertisement

సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. విడుద‌ల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తున్నారని సమాచారం. ఈ మెగా మల్టీ స్టారర్ చిత్రం అనౌన్స్ అయ్యి సరిగ్గా ఈరోజుతో నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుందని ఓ ఆసక్తికర పోస్ట్‌తో తెలియజేసింది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.

Advertisement

సరిగ్గా నాలుగేళ్ల కిందట అన‌గా 2017లో రాజమౌళి ఈ ఫోటో పెట్టి ఎన్నో ఊహాగానాలకు నాంది పలికారని తెలుస్తోంది. ఈ సినిమా మొదలు పెట్టి ముచ్చ‌ట‌గా మూడేండ్లు పూర్తి చేసుకున్నామని ఇప్పుడు 50 రోజుల్లో ఈ సినిమా మ్యాజిక్ ని విడుద‌ల చేయ‌డానికి సిద్ధం చేస్తున్నాం అని ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఫోటోతో పాటు పోస్ట్ కూడా వైరల్‌గా మారిందని తెలుస్తుంది.ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10000 స్క్రీన్లలో విడుదల అవుతుందట‌. ఇదే కూడా జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో విడుదల కానుందని సమాచారం.. ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ అంచనాలతో వ‌స్తుండ‌డంతో ఏ విధంగా ఆడుతుందో ఎన్ని తిరుగ‌రాస్తుందో చూడాలి మ‌రి. ఈ సినిమా కోసం వేలాది మంది అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నట్టు స‌మాచారం.

 

Visitors Are Also Reading