Home » విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌.. అందుకోస‌మేనా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌.. అందుకోస‌మేనా..?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ మ‌ధ్య ఆయ‌న వ‌రుస సినిమాల‌తో న‌టిస్తూ బిజీగా గ‌డిపేస్తున్నారు. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి సినిమాతో యూత్ మ‌దిలో నిలిచిపోయాడు. అప్ప‌టి నుంచి క్ర‌మ‌క్ర‌మంగా అభిమానుల‌ను పెంచుకుంటూ వ‌స్తున్నాడు విజ‌య్. సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ కూడా అధికంగానే ఉండ‌డం విశేషం. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వారిలో అప్ప‌ట్లో చిరంజీవి త‌రువాత ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ అనే చెప్ప‌వ‌చ్చు.

Advertisement

విజ‌య్ హీరోగా మాస్ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన సినిమా లైగ‌ర్‌. భారీ అంచ‌నాల మ‌ధ్య ఆగ‌స్టు 25న విడుద‌లైన ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గానే నిలిచింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే, ర‌మ్య‌కృష్ణ‌, మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సినిమా విడుద‌ల త‌రువాత కొద్ది రోజుల పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్న విజ‌య్ తాజాగా ఓ వీడియో షేర్ చేసి అభిమానుల్లో స్ఫూర్తి నింపేవిధంగా క్యాప్ష‌న్ ఇచ్చారు.

Also Read :  టక్కరి దొంగ సినిమా స్టోరీ వినగానే సూపర్ స్టార్ కృష్ణ ‘మహేష్’ కి ఏమని వార్నింగ్ ఇచ్చారో తెలుసా ?

ముఖ్యంగా లైగ‌ర్ సినిమా కోసం వ‌ర్క‌వుట్స్ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. క‌ష్ట‌ప‌డి ప‌ని చేయండి. మిమ్మ‌ల్ని మీరు ప్రోత్స‌హించుకోండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. త‌ప్పుల నుంచి నేర్చుకోండి విజ‌యాన్ని ఎంజాయ్ చేయండి. మీకు కావాల్సిన జీవితాన్ని గ‌డిపేయండి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ సినిమా కోసం విజ‌య్ చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. ప్ర‌ధానంగా మిక్స్డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ అథ్లెట్‌గా క‌నిపించాడు. ఈ సినిమాని మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ప్ర‌స్తుతం విజ‌య్ ఖుషి సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. స‌మంత క‌థానాయిక న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.

Also Read :  కృష్ణంరాజు కోసం 12 ఏళ్ల త‌రువాత తొలిసారి ప్ర‌భాస్ అక్క‌డికి..!

Visitors Are Also Reading