Home » జాతీయ ప‌తాకాన్ని రూపొందించిన పింగ‌ళి వెంక‌య్య గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..?

జాతీయ ప‌తాకాన్ని రూపొందించిన పింగ‌ళి వెంక‌య్య గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..?

by Anji
Ad

భార‌తీయుల‌కు ప్ర‌త్యేకంగా ఒక జెండా ఉండాల‌ని భావించి దానికి రూప‌క‌ల్ప‌న చేసిన వ్య‌క్తి పింగ‌ళి వెంక‌య్య‌. అత‌ను రూపొందించిన ప‌తాకానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్ర‌స్తుతం మ‌న జాతీయ జెండా రెప‌రెపలాడుతోంది. భార‌త స్వాతంత్య్ర సంగ్రామంలో పింగ‌ళి వెంక‌య్య చేసిన కృషిని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌న్ కీ బాత్‌లో ప్ర‌శంసించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని భ‌ట్లపెనుమ‌ర్రు గ్రామంలో 1876 ఆగ‌స్టు 02న జ‌న్మించారు. భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంలో ప‌లువురు ప్ర‌ముఖులు పింగ‌ళి వెంక‌య్య పుట్టిన భ‌ట్ల పెనుమ‌ర్రు గ్రామాన్ని సంద‌ర్శిస్తున్నారు.

Advertisement

కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఇటీవ‌లే పింగ‌లి వెంక‌య్య మ‌న‌వ‌రాలు సుశీల‌ను స‌న్మానించి ఆ పోరాట యోధుడిని స్మ‌రించుకున్నారు. సైనిక ద‌ళాల‌ను చూసి ఆక‌ర్షితుడైన వెంక‌య్య 19 ఏళ్ల‌కే బ్రిటీష్ ఇండియా సైన్యంలో చేరారు. ద‌క్షిణాప్రికాలో జ‌రిగిన బోర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్క‌డ బ్రిటిష్ సైన్యం యూనియ‌న్ జాక్ ఎగ‌రేస్తున్న తీరు ఆయ‌న‌లో జాతీయ వాద స్పూర్తి ర‌గిలింది. ఆయ‌న గాంధీజి క‌లిశారు. స్వాతంత్య్రం పోరాట స‌మ‌యంలో కాంగ్రెస్ స‌మావేశాల్లో బ్రిటీష్ జెండాను ఎగుర‌వేస్తుండ‌డం వెంక‌య్య జీర్ణించుకోలేక‌పోయారు. 1906లో క‌ల‌క‌త్తాలో జ‌రిగిన అఖిల భార‌త కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో వెంక‌య్య దేశం కోసం జెండా త‌యారు చేయాల‌నే త‌ప‌న‌ను ర‌గిలించింది. జాతీయ ప‌తాకానికి సంబంధించి ప‌లు మోడ‌ల్స్ డిజైన్ చేశారు.


1921 మార్చి 31న బెజ‌వాడ‌లో జ‌రిగిన ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ స‌మావేశంలో వెంక‌య్య డిజైన్ చేసిన ప‌తాకానికి మ‌హాత్మ‌గాంధీ ఆమోదం తెలిపారు. గాంధీ వెంక‌య్య స‌మ‌ర్పించిన మోడ‌ల్ లో రెండు రంగులు ఆకుప‌చ్చ‌, ఎరుపుతో పాటు మ‌ధ్యలో చ‌ర్కా ఉన్నాయి. ఎరుపు, ఆకుప‌చ్చ రంగులు హిందూ, ముస్లింల‌కు ప్ర‌తీక‌లు. మిగిలిన సామాజిక వ‌ర్గాల‌కు కూడా ప్రాతినిధ్యం క‌ల్పించాల‌ని గాంధీ సూచించ‌డంతో ఆ ప‌తాకానికి వెంక‌య్య తెలుపు రంగును పైభాగంలో చేర్చారు. దీంతో అది త్రివ‌ర్ణ ప‌తాకంగా మారింది. ముఖ్యంగా జాతీయ జెండా త‌యారు చేయ‌డం కోసం వెంక‌య్య ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. భార‌త‌దేశానికి జాతీయ జెండా అనే పుస్త‌కాన్ని ఆయ‌న 1906లోనే ప్ర‌చురించారు.

Advertisement


1921లో పింగ‌ళి వెంక‌య్య రూపొందించిన జెండాను కాంగ్రెస్ స‌మావేశాల్లో ఎగుర‌వేశారు. 1931లో కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాగా స్వీక‌రించింది. గాంధీ చేప‌ట్టిన అహింసా ఉద్య‌మానికి త్రివ‌ర్ణ ప‌తాకం స్ఫూర్తిగా నిలిచింది. ఎరుపు రంగు స్థానంలో కాషాయం చేర్చారు. మ‌ధ్య‌లో తెలుపు, దిగువ‌న ఆకుప‌చ్చ రంగు ఉండేలా మార్చారు. 1947 జులై 22న రాజ్యాంగ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని జాతీయ జెండాగా స్వీక‌రించింది. గాంధీ చ‌ర్కాను స్థానంలో అశోక చ‌క్రాన్ని చేర్చారు. జాతీయ జెండాను పింగిళి వెంక‌య్య రూపొందించిన జెండాకు ఆమోదం తెలిపిన నాటి ప్యానెల్ హైద‌రాబాద్ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాఉల సుర‌య్య త్యాబ్జీ స‌భ్యురాలుగా ఉన్నారు. వెంక‌య్య‌ను జ‌పాన్ భాష‌లో ఆయ‌న అన‌ర్గ‌ళ వాగ్దాటిని చూసిన జ‌నం ఆయ‌న‌ను జపాన్ వెంక‌య్య అని పిలుచుకునే వారు.

1907 నుంచి 1910 వ‌ర‌కు వెంక‌య్య మున‌గాల ప‌ర‌గ‌ణాలో వ్య‌వ‌సాయ అధికారిగా ప‌ని చేశారు. కొత్త ర‌కం ప‌త్తి వంగ‌డాల అభివృద్ధిలో ఆయ‌న విశేష కృషి చేశారు. మున‌గాల ప‌రిధిలోకి రైతులు ఆయ‌న‌ను ఆప్యాయంగా ప‌త్తి వెంక‌య్య అని పిలిచేవారు. వ‌జ్రాలు-త‌ల్లి రాయి అనే పుస్త‌కాన్ని ప్ర‌చురించారు. ఆంధ్ర‌లో వ‌జ్రాల‌పై చేసిన ప‌రిశోధ‌న‌కు వ‌జ్రాల వెంక‌య్య అని కూడా పిలిచేవారు. 1911 నుంచి 1920 వ‌ర‌కు మచిలీప‌ట్నం నేష‌న‌ల్ కాలేజీ టీచ‌ర్ గా ప‌ని చేశారు. విద్యార్థుల‌కు జీవ‌న నైపుణ్యాల‌కు పాఠాలు ఆయ‌న బోధించారు. పిల్ల‌ల‌కు ప‌ట్టుసాగు, ఈత, గుర్ర‌పు స్వారీ, వ్య‌వసాయం వంటివి నేర్పించారు. ఆయ‌న‌ను విద్యార్థులు ఎంతో ప్రేమ‌తో వెంక‌య్య మాస్ట‌రూ అని పిలుచుకునేవారు. వీట‌న్నింటికి మించి పింగ‌ళి వెంక‌య్య జాతీయ ప‌తాకాన్ని రూపొందించి దేశ‌వ్యాప్తంగా పేర్గాంచారు. ఆయ‌న చివ‌రి జీవితం దుర్భరంగా సాగింది. క‌డు పేద‌రికంతో ఆయ‌న జులై 04, 1963 క‌న్ను మూయ‌డం దుర‌దృష్ట‌క‌రం.

Also Read : 

నేత‌న్న‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌.. మ‌రో ప‌థ‌కానికి శ్రీ‌కారం..!

“సంతోషం” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసా..?

 

Visitors Are Also Reading