Home » Indra vs Samarasimha reddy: ఇంద్ర vs సమరసింహా రెడ్డి రెండిటిలో ఏది పెద్ద హిట్ ?

Indra vs Samarasimha reddy: ఇంద్ర vs సమరసింహా రెడ్డి రెండిటిలో ఏది పెద్ద హిట్ ?

by Sravya

Indra vs Samarasimha reddy : మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. స్వయంకృషితో చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చి అప్పటినుండి ఇప్పటివరకు కూడా సినిమాలతో అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

indra-vs-narasimhanaidu

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు తన తండ్రి తర్వాత బాలకృష్ణ హీరోగా మారి ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలే. మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే. చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వాళ్ళే.

చిరంజీవి నటించిన సినిమాల్లో ఇంద్ర సినిమా చెప్పుకోదగ్గది. అలానే బాలయ్య సమరసింహారెడ్డి కూడా అద్భుతంగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అయితే ఇంద్ర సమరసింహారెడ్డి రెండిట్లో ఏది హిట్ అయింది..? ఫ్యాక్షనిజం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య సమరసింహారెడ్డి సినిమా తెర మీదకు వచ్చింది బాలయ్య నట విశ్వరూపాన్ని స్క్రీన్ మీద అద్భుతంగా చూపించారు. సిమ్రాన్ అంజలా జవేరి ఈ సినిమాలో బాలయ్య సరసన నటించారు మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఏకధాటిగా ఈ సినిమా ఒక థియేటర్లో 365 రోజులు ఆడింది.

Also read:

samarasimhareddy

మూడు థియేటర్లలో 227 రోజులు ఈ సినిమా ఆడింది. 14 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఇక ఇంద్ర సినిమా విషయానికి వస్తే ఇంద్ర సినిమా కూడా అద్భుతంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ని రాబట్టింది ఈ సినిమాకి కూడా మణిశర్మ సంగీతం అందించారు. చిరంజీవి సరసన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే నటించారు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు ఇప్పటికి కూడా పేలుతుంటాయి. సమరసింహారెడ్డి తరహాలోనే ఈ మూవీ కూడా సాగింది ఒక సెంటర్లో 227 రోజులు ఆడింది ఇంద్ర సినిమా 32 చోట్ల 170 రోజులు ఆడింది అలానే చాలా చోట్ల 100 రోజులు 50 రోజుల్లో కూడా ఆడింది ఇలా బాలకృష్ణ చిరంజీవి ఫ్యాక్షనిజం నేపథ్యంలో మూవీలని చేసి సూపర్ హిట్ ని అందుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading