మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ సాధించినదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా బి.గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ సినిమాలు ఏవిధంగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. బాలయ్యతో భారీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన బి.గోపాల్ చిరంజీవితో కూడా ఇంద్ర సినిమా రూపొందించి సంచలన విజయాన్ని నమోదు చేసారు.
Advertisement
Advertisement
2002లో వచ్చిన ఇంద్ర చిరంజీవి కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు బి.గోపాల్ ఆ సినిమా విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇంద్ర సినిమా ఒక సెన్సేషన్. దాయి దాయిదామ్మా, భం భం బోలే, రాధే గోవిందా వంటి పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి. పాటలకు చిరంజీవి అద్భుతంగా డాన్స్ చేశారు. మొక్కే కదా అని పీకితే పీక కోస్తా వంటి డైలాగ్స్ చిరంజీవి చాలా బాగా చెప్పారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయం మాత్రం చెప్పాలి. సాధారణంగా ఒక సినిమాకు బ్లాక్‌లో టికెట్ల కోసం 500-600 పెడుతుంటారు. కానీ ఆరోజుల్లో మొదటిరోజు టికెట్ దొరకకపోతే ఓ వ్యక్తి ఏకంగా రూ.10వేలు పెట్టి మరీ 5 టికెట్లను తీసుకున్నట్టు తెలిసిందని గుర్తు చేశారు బి.గోపాల్. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అంటే అది మరీ అని పేర్కొన్నారు.