Home » IND Vs AFG : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. రెండు సూపర్ ఓవర్ల తర్వాత తేలిన ఫలితం..!

IND Vs AFG : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. రెండు సూపర్ ఓవర్ల తర్వాత తేలిన ఫలితం..!

by Anji
Ad

క్రికెట్ అభిమానులకు మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చింది. భారత్ వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడో టీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు హోరా హోరీగా జరిగింది. ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 212 పరుగులు చేసింది. విజయం తమదే అనే ధీమాలో భారత్ జట్టు ఉంది. కానీ ఎవ్వరూ ఊహించనివిధంగా అప్గాన్ బ్యాటర్స్ రెచ్చిపోవడంతో భారత్ స్కోరు సమం చేసింది. ఇక సూపర్ ఓవర్ జరిగింది. సూపర్ ఓవర్ కూడా టై కావడం గమనార్హం.

Advertisement

చివరికీ రెండో సూపర్ ఓవర్ లో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిచింది భారత్ అయినప్పటికీ.. అప్గాన్ పోరాటానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. టీమిండియా 3-0 తో సిరీస్ సొంతం చేసుకుంది. తొలి సూపర్ ఓవర్ లో ఇరు జట్లు 16 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఇక రెండో సూపర్ ఓవర్ లో తొలుత భారత్ 11 పరుగులు చేసింది. అప్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం.. సూపర్ ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోతే ఇన్నింగ్స్ ముగిసినట్టే కావడంతో భారత్ విజయం సాధించింది.

Advertisement

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మకి దక్కింది. అంతర్జాతీయ టీ 20 లలో ఐదో సెంచరీ సాధించాడు రోహిత్. రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అప్గాన్ ఓపెనర్లు 66 బంతుల్లో 93 పరుగులు జోడించి తమ జట్టుకు శుభారంభం అందించారు. గుల్బదిన్, నబి కలిసి జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చారు. విజయం కోసం చివరి 19 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్గాన్ 18 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. హోరా హోరీ పోరు రసవత్తరంగా కొనసాగింది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading