ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో ఇండియా టైటిల్ ఫెవరెట్ జట్టు. కానీ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అనేది ఓడిన తర్వాత బంగ్లాదేశ్ తో ఇండియా తప్పకుండ గెలవాల్సిన అవసరం అనేది వచ్చింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించినా.. ఆటగాళ్లతో సమానంగా భారత సైడ్ఆర్మ్ త్రోవర్ రఘుకు కూడా మంచి పేరు అనేది వచ్చింది.
Advertisement
అయితే నెట్స్ లో మన బ్యాటర్లకు సైడ్ఆర్మ్ త్రో చేయడం ఆయన పని. కానీ నిన్నటి మాస్క్ లో ఆయన చేతిలో బ్రష్ పట్టుకుని గ్రౌండ్ అంతా తిరుగుతూ కనిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ తర్వాత.. ఫీల్డింగ్ సమయంలో వర్షం వచ్చిన విషయం తెలిసిందే. వర్షం తర్వాత మ్యాచ్ అనేది ప్రారంభం అయ్యే సమయంలో.. పిచ్ పైన కొన్ని నీళ్లు అనేవి ఉన్నాయి.
Advertisement
కాబట్టి ఆ పిచ్ పైన ఫీల్డింగ్ అనేది చేయడం మన ఆటగాళ్లకు కష్టం. తడి పిచ్ పైన పరిగెడితే ఏం అవుతుందో అందరికి తెలుసు. మట్టి అనేది షూస్ లో ఇరికి పరిగెత్తడం కష్టం అవుతుంది. అందుకే రఘు చేతిలో బ్రష్ పట్టుకుని గ్రౌండ్ అంత తిరుగుతూ.. ఆటగాళ్ల షూస్ లోని మట్టిని క్లిన్ అనేది చేసాడు. మన ఆటగాళ్లను నిన్న అంత మంచి ఫీల్డింగ్ చేయడానికి ఇది కూడా ఒక్క కారణం. అయితే వేరే జట్టు అయితే ఇలాంటి పని చేయదు అని.. ఇదే ఇండియా జట్టులో ఉన్న గొప్పతనం అని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి :