Home » గ్యాస్ సిలిండ‌ర్ పేలితే 50ల‌క్ష‌లు…! ప్ర‌తి భార‌తీయుడు తెలుసుకోవాల్సిన 10 హ‌క్కులు ఇవే..!

గ్యాస్ సిలిండ‌ర్ పేలితే 50ల‌క్ష‌లు…! ప్ర‌తి భార‌తీయుడు తెలుసుకోవాల్సిన 10 హ‌క్కులు ఇవే..!

by AJAY
Ad

లా ప్రకారం భారత దేశ పౌరులకు ఎన్నో హక్కులు ఉన్నాయి. కానీ అవి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ మన హక్కులు మనం తెలుసుకుంటే అవి ధైర్యాన్ని తెచ్చిపెడతాయి. స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కునేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. కాబట్టి హ‌క్కుల‌ను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మనకు తెలియని ముఖ్యమైన హక్కులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

law
ఒక నేరానికి శిక్ష అనుభవించిన రోజు అదే తరహా నేరానికి అదే రోజు మళ్లీ శిక్షించడానికి హక్కు లేదు. ఒక రోజు మీరు హెల్మెట్ లేకుండా పట్టుబడి ఫైన్ కట్టారు అంటే అదే రోజు మళ్ళీ హెల్మెట్ లేకుండా కనబడితే ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు.

Advertisement

దుకాణాలలో అమ్మకందారుడు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్ కి ఆమె హక్కు లేదు. కానీ ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు బేరమాడే హక్కు కొనుగోలుదారుడు ఉంటుంది.

pregnency

pregnency

గర్భిణీ స్త్రీని ఉద్యోగం నుండి తొలగించే హక్కు ఏ కంపెనీకి ఉండదు. ఒకవేళ అలా చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి కొడుకు లేదంటే మనవడు ఉన్నట్లయితే అతడు మరొకరిని దత్తత తీసుకోవడానికి వీలులేదు. ఒకవేళ తీసుకుంటే ఇద్దరి మధ్య వయసు తేడా సుమారు 21 సంవత్సరాలు ఉండాలి.

మేజర్లు కాకపోయినప్పటికీ ఇద్దరు యువతీ యువకులు సహజీవనం చేయవచ్చు. కానీ పెళ్లి మాత్రం చేసుకోకూడదు. వీరికి పుట్టిన పిల్లలకు అన్ని రకాల హక్కులు లభిస్తాయి.

Advertisement


ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన‌ట్ల‌యితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. అలా చేస్తే చట్ట ప్రకారంగా గ్యాస్ ఏజెన్సీ నుండి యాభై లక్షలు నష్టపరిహారం క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఉదయం ఆరు గంటల లోపు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏ మహిళను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళరాదు. తీవ్రమైన నేరం చేసినట్లయితే మెజిస్ట్రేట్ పర్మిషన్ తో అరెస్టు చేయవచ్చు.

ఏ సమయంలో అయినా ఒక సంఘటన గురించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు సంఘ‌ట‌న‌ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరో పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫ‌ర్ చేయాల్సి ఉంటుంది.

పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడానికి నిరాకరించినట్లు అయితే అతడిపై ఫిర్యాదు చేయవచ్చు. నేరం నిరూపితమైతే అతనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుంది.


ఫైవ్ స్టార్ హోటల్ అయినా సరే అందులో వాష్ రూమ్ ల‌ను వినియోగించుకోవడానికి, మంచినీళ్ళు తాగడానికి ప్ర‌తి పౌరుడికి హ‌క్కు ఉంటుంది. కాదనడానికి హోటల్ సిబ్బందికి ఎలాంటి హక్కు ఉండదు.

యూనిఫాం లో ఉన్నా లేకపోయినా ఒక పోలీస్ ఆఫీసర్ 24 గంటలు డ్యూటీ లో ఉన్నట్టే. తాను డ్యూటీలో లేనని ఫిర్యాదు నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం.

also read : రైలు కూత వెనుక ఇంత అర్థం ఉందా..?

Visitors Are Also Reading