ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగే చివరి మూడు టెస్ట్ లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అందరూ ఊహించిన విధంగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన టెస్ట్ మ్యాచ్ లకు కోహ్లీ అందుబాటులో ఉండదని.. విరాట్ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని బీసీసీఐ పేర్కొంది.
Advertisement
Advertisement
గాయాల కారణంగా రెండో టెస్ట్ కి దూరమైన కే.ఎల్.రాహుల్, రవీంద్ర జడేజాలు జట్టులోకి వచ్చారు. ఇద్దరికీ బీసీసీఐ నుంచి ఫిట్ నెస్ కి క్లియరెన్స్ వచ్చింది. దేశవాళీ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. రజత్ పాటిదార్, సర్పరాజ్ ఖాన్, దృవ్ జురెల్ లను చివరి మూడు టెస్ట్ లకు కూడా బీసీసీఐ కొనసాగించింది. వెన్ను నొప్పి గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు.
భారత జట్టు ఇదే :
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కే.ఎల్.రాహుల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కేఎస్ భరత్, ఆర్.అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ ఎంపికయ్యారు.