ప్రపంచ క్రికెట్ లో ప్రస్తతం భారత జట్టుకు..భారత ఆటగాళ్లకు ప్రత్యేక స్థానం అనేది ఉంది. క్రికెట్ లో ఇప్పుడు ఉన్న ఆటగాళ్లలో ఇండియా ప్లేయర్స్ కే ఎక్కువ క్రేజ్ అనేది ఉంది. అయితే ఇదే సమయంలో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో లీగ్ క్రికెట్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రతి క్రికెట్ బోర్డు కూడా ఒక్కో లీగ్ ను ప్రారంభిస్తుంది. అయితే అన్ని జట్ల ఆటగాళ్లకు కూడా ఆ లీగ్స్ లో పాల్గొనే అవకాశం అనేది ఉంది.
Advertisement
కానీ భారత ఆటగాళ్లు మాత్రం బీసీసీఐ మొదటిసారి ప్రారంభించిన క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ లో తప్ప వేరే లీగ్ లో పాల్గొనడానికి లేదు. ఒకవేళ ఏ ఆటగాడు అయిన వేరే లీగ్ లో పాల్గొనాలి అనుకుంటే వారు జాతీయ జట్టుతో పాటుగా దేశవాళీ అలాగే ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ అనేది ప్రకటించాలి. అందుకే మన ఆటగాళ్లు వేరే లీగ్స్ లో పాల్గొన్నారు.
Advertisement
అయితే భారత ఆటగాళ్లకు మిగితా లీగ్స్ లో ఆడే స్వేచ్ఛ ఇవ్వడంపై తాజాగా ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ… మేము భారత ఆటగాళ్లకు వేరే జట్లలో ఆడే స్వేచ్ఛ అనేది ఇవ్వం. పెరుగుతున్న లీగ్ క్రికెట్ వల్ల మన ఆటగాళ్లకు వేరే లీగ్స్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని అంటున్నారు. కానీ బీసీసీఐ మాత్రం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. మన వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటూ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :