Home » మరో ఇండియా vs పాకిస్థాన్ సమరానికి సమయం సిద్ధం..!

మరో ఇండియా vs పాకిస్థాన్ సమరానికి సమయం సిద్ధం..!

by Azhar
Ad

ఇండియా vs పాకిస్థాన్… ఈ పదం వినగానే రెండు దేశాలలోని ప్రజలలో ఎక్కడ లేని ఉత్సుకత అనేది వస్తుంది. అది ఏ విషయంలోనైనా సరే విజయం ఎవరిది అనేది మాత్రమే చూస్తారు. ఏ దేశం విజయం సాధిస్తే.. అక్కడ సంబరాలు అనేవి జరుగుతాయి. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో టీం ఇండియా జట్టు పాకిస్థాన్ చేతిలో ఓటమి కాదు.. ఘోర ఓటమి పాలైంది. ఇక అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు ఈ రెండు జట్లు అనేవి పోటీ పడుతాయి అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి ఇండియాను ఓడించాలని పాకిస్థాన్.. గత ఓటమికి ప్రతీకారం కోసం ఇండియా అనుకుంటుంది.

Advertisement

అయితే ఈ రెండు జట్లు ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అక్టోబర్ 23న పోటీ పడుతాయి అని అందరూ అనుకుంటున్నారు. కానీ మధ్యలో ఈ ఏడాది ఆగస్టులో ఆసియా కప్ ఉంది అనే విషయం చాలా మంఫీ మర్చిపోయారు. అందుకు కారణం ఈ టోర్నీ అనేది శ్రీలంకలో జరుగుతుండటం. ఎందుకంటే.. ఇప్పుడు లంకలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. అక్కడ ఉన్న ఆర్ధిక పరిస్థుతుల వల్ల ఈ టోర్నీ అక్కడ జరగదు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్యే ఆస్ట్రేలియా జట్టు లంకలో విజయ వంతంగా పర్యటించడంతో ఈ ఆసియా కప్ కూడా జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు.

Advertisement

అందుకు తగ్గిన విధంగానే ఈ టోర్నీని నిర్వహించడానికి లంక బోర్డు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 11 వరకూ జరిగే ఆసియా కప్ లీగ్ దశలో ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ అనేది ఆగస్టు 28న జరగనున్నట్లు తెలుస్తుంది. దాంతో ఈ ఒక్కే ఏడాది రెండు దాయాది దేశాలు రెండు సార్లు పోటీ పడబోతుండటం అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఇండియా జట్టు ఒక్కటికి రెండు రూపంలో పాకిస్థాన్ కు తిరిగి ఓటమి అనేది ఇస్తుందా.. లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ ప్రపంచ కప్ జట్టులో.. క్లారిటీ ఇచ్చిన రోహిత్..!

ఇంగ్లాండ్ బాగా ఆడింది.. అందుకే ఓడిపోయాం : ద్రావిడ్

Visitors Are Also Reading