భారత జట్టు ప్రదర్శన గత కొంతకాలంగా పడిపోతుంది అనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో మన ఉన్న స్థానాలు చూస్తే మాత్రం ఎవరు ఈ మాట అన్నారు. అయితే ఇలా మనం బాగా ఆడటం లేదు అనే వార్తలు రావడానికి కారణం కోహ్లీ, రోహిత్ శర్మ. ఎందుకంటే ఎక్కువమంది టీం ఇండియా అంటే వీరు ఇద్దరే అనుకుంటారు. కానీ ఇప్పుడు వీరు ఫేమ్ లో లేకపోవడంతో.. మొత్తం టీం ఇండియానే సరైన ప్రదర్శన అనేది చేయడం లేదు అనుకుంటున్నారు.
Advertisement
కానీ నిన్న మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా అద్భుతమైన 10 వికెట్ల విజయం అందుకుంది. అందువల్ల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత జట్టు పాకిస్థాన్ ను కిందరు నెట్టి 3వ స్థానంలోకి చేరుకుంది. ప్రస్తుతం వన్డేలవ్ న్యూజిలాండ్ మొదటి స్థానం, ఇంగ్లాండ్ రెండో స్థానం, టీం ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాత పాకిస్థాన్ ఒక్క స్థానమా కిందకు పడిపోయి నాలుగో స్థానానికి వెళ్ళింది. కానీ ఈ వన్డేలలో టాప్ 3 లోకి వచ్చిన ఇండియా ఓ రికార్డ్ ను తన పేరిట నిలుపుకుంది.
Advertisement
అదేంటంటే.. ప్రస్తుతం వన్డేలలో మూడో స్థానంలో ఉన్న భారత జట్టు.. టెస్ట్ ఫార్మాట్ లో 2వ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక టీ20 లలో అయితే అగ్ర స్థానంలో ఉంది. అందువల్ల మూడు ఫార్మాట్లలో టాప్ 3 లో ఏకైక జట్టుగా టీం ఇండియా నిలిచింది. ప్రస్తుతం ఇలా అన్ని ఫార్మాట్ లలో టాప్ 3లో ఏ జట్టు కూడా లేదు. అయితే రేపు ఇంగ్లాండ్ తో టీం ఇండియా రెండో వన్డేలో తలపడబోతుంది. కాబట్టి ఇందులో విజయం సాధించిహ్ ఇంగ్లాండ్ స్థానానికి ఇండియా ఎసరు పెట్టె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
ఇవి కూడా చదవండి :