Home » ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. పుజారే, రహానేలకు మళ్లీ నిరాశ..!

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. పుజారే, రహానేలకు మళ్లీ నిరాశ..!

by Anji
Ad

భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య జనవరి 25 నుంచి టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం 5 టెస్ట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది . ఈ సిరీస్‌కు ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా.. ఇప్పుడు భారత జట్టును కూడా ప్రకటించింది.

Advertisement

ఈ సిరిస్‌లోని తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనున్నారు.  ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. గాయం కారణంగా షమీ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో షమీ తన గాయం నుంచి కోలుకుని టీమిండియాకు తిరిగి వస్తాడని భావించారు. అయితే తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో షమీ పేరు లేదు. షమీతో పాటు యువ వికెట్ కీపర్-బ్యాటర్‌ ఇషాన్ కిషన్ కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు.

Advertisement

 

ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఎంపిక చేసిన టెస్టు జట్టులో కిషన్‌కు కూడా చోటు దక్కలేదు. టెస్టు సిరీస్ కోసం ఇద్దరు కొత్త ఆటగాళ్లను టెస్టు జట్టులోకి తీసుకున్నారు. ఆ ఆటగాళ్లలో మొదటి పేరు అవేష్ ఖాన్..  మరోవైపు జట్టులో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ స్థానంలో ధృవ్ జురెల్‌కు అవకాశం లభించింది.  ధృవ్ జురెల్ రాకతో భారత జట్టులో మొత్తం 3 వికెట్ కీపర్లు ఉన్నారు. ఈ స్థానానికి ధ్రువ్‌తో పాటు కేఎల్ రాహుల్, కేఎల్ భరత్ కూడా ఎంపికయ్యారు.

తొలి రెండు మ్యాచ్ లకు భారత జట్టు : 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.

Visitors Are Also Reading