Home » IND vs ENG : రెండో రోజు భారత్ స్కోర్ ఎంతంటే..?

IND vs ENG : రెండో రోజు భారత్ స్కోర్ ఎంతంటే..?

by Anji
Ad

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  దీంతో ఆ జట్టు 246 పరుగులకు ఆలౌటు అయింది.  ఇక తొలి ఇన్నింగ్స్ ఆడుతోన్న భారత్.. రెండో రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది.

Advertisement

Advertisement

రవీంద్ర జడేజా 81 పరుగులు, అక్షర్ పటేల్ 35 పరుగులతో నిలిచారు. జడేజా తన టెస్టు కెరీర్‌లో 20వ అర్ధశతకం సాధించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 175 పరుగుల ఆధిక్యం సాధించింది.  కేఎస్ భరత్ 41 పరుగుల వద్ద, కేఎల్ రాహుల్ 86 పరుగుల వద్ద, యశస్వి జైస్వాల్ 80 పరుగుల వద్ద ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2 వికెట్లు పడగొట్టాడు. రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, జో రూట్ తలో వికెట్ తీశారు. కాగా, శుక్రవారం భారత జట్టు 119/1 స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.

 

Visitors Are Also Reading