ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనేది ఎప్పుడు జరిగిన అది ఓ యద్ధం అనే విధంగానే ఫ్యాన్స్ దానిని చూస్తారు. ఇక ఆ మ్యాచ్ తో ఎంతో మజాను కూడా పొందుతారు ఫ్యాన్స్. అయితే అలంటి మజాను పొందే అవకాశం రెండు దేశాల క్రికెట్ అభిమానులకు ఒక్కే వారం రోజులో రెండు సార్లు వచ్చింది. ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ గత ఆదివారం తలపడిన విషయం తెలిసిందే.
Advertisement
ఇక ఈరోజు కూడా మళ్ళీ ఇండియా, పాకిస్థాన్ జట్లు సూపర్ 4 లో భాగంగా తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ అనేది ఓడిపోయాడు. ఇక టాస్ గెలిచినా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం బొయిలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ టోర్నీలో టాస్ గెలిచినా జట్టుకే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. గత సారి మనం పాక్ పై గెలిచిన సమయంలో టాస్ మనదే. కానీ ఇప్పుడు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వస్తున్న ఇండియా విజయం సాధించగలదా.. లేదా అనేది చూడాలి.
Advertisement
ఇండియా జట్టు : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(wk), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
పాకిస్థాన్ జట్టు : మహ్మద్ రిజ్వాన్(wk), బాబర్ ఆజాం(c), ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా