Home » ఆసియాకప్‌ విజేతగా భారత్‌.. ఈ 5 కారణాల వల్లే గెలిచాం !

ఆసియాకప్‌ విజేతగా భారత్‌.. ఈ 5 కారణాల వల్లే గెలిచాం !

by Bunty
Ad

ఆసియా కప్ 2023 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా నిలిచింది. వరల్డ్ కప్ 2023 టోర్నమెంటుకు ముందు… ఆసియా కప్ విజేతగా నిలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది టీమిండియా. ఇవాళ కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో.. ప్రత్యర్థి శ్రీలంక జట్టుపై ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

India demolish Sri Lanka by 10 wickets to win Asia Cup

India demolish Sri Lanka by 10 wickets to win Asia Cup

టీమిండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో… 50 పరుగులకే కుప్పకూలింది శ్రీలంక జట్టు. ఇందులో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ గా వెనిదిరిగారు. ఇక 51 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా… కేవలం ఆరు ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. లక్ష్య చేతనకు దిగిన టీమిండియా బ్యాటర్లు ఇషాన్ 23 పరుగులు, గిల్ 27 పరుగులు చేసి వికెట్ పడకుండా 6.1 ఓవర్లలోనే అద్భుత విజయాన్ని అందించారు. కాగా టీమిండియా కు ఇది ఎనిమిదవ సారి ఆసియా కప్ టైటిల్ దక్కడం గమనార్హం.

Advertisement

Advertisement

ఇక ఆసియా కప్ గెలవడంపై… టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా ఆసియా కప్ ఫైనల్ గెలవడానికి కీలక కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది టీమిండియా బౌలింగ్. టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్… తన ఫేస్ బౌలింగ్ తో శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలోనే ఏడు ఓవర్లు వేసిన సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు తీశాడు.

అటు హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ రూపంలో… రెండు ఓవర్లు మాత్రమే వేసిన పాండ్యా ఏకంగా మూడు వికెట్లు తీశాడు. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. టీమిండియా ఫిల్లింగ్ కారణంగా కూడా ఆసియా కప్ ఫైనల్ లో విజయం సులభం అయిందని చెప్పవచ్చు. అలాగే వర్షం కూడా పడకుండా… టీమిండియా కు మేలు చేసింది. అటు టాస్ గెలిచి శ్రీలంక మొదట బ్యాటింగ్ తీసుకోవడం కూడా టీమిండియా కు అనుకూలించింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading