ఆసియా కప్ కోసం అన్ని దేశాల జట్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఆసియా కప్ ని భారత టీం పాకిస్తాన్ తో మొదలుపెట్టనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేదిక ఏ జట్టు కి ఎంతవరకు కలిసి వస్తుంది..? ఇదివరకు ఈ మైదానంలో ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉంది అనేది తెలుసుకుందాం.
భారత జట్టు అలానే శ్రీలంక మధ్య క్యాండీ లోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో మొత్తం మూడు మ్యాచ్లు జరిగాయట. ఇక్కడ టీమిండియా చాలా చక్కగా ఆడింది. వంద శాతం రికార్డు వుంది ఇండియాకి ఇక్కడ. టీమిండియా ఈ స్టేడియంలో మొత్తం 3 మ్యాచ్లు ఆడింది. మూడింట్లో కూడా ఇండియా ఏ గెలిచింది.
Advertisement
Advertisement
294 పరుగులు ఇండియా ఇక్కడ చేసింది. అవే ఎక్కువ రన్స్. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ మొత్తం ఐదు వన్డేలు ఆడింది. అందులో 2 మ్యాచ్ల లోనే గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. అత్యధిక స్కోరు వచ్చేసి 287. ఇది ఇలా ఉంటే ఇప్పటి దాకా జరిగిన మ్యాచ్ల గురించి చూస్తే.. ఇక్కడ 9 టెస్టు మ్యాచ్లు, 23 టీ20 మ్యాచ్లు, 33 వన్డేలు జరిగాయి.
Also read:
- ఓనమ్ పాటతో అనుపమ.. వావ్ ఎంత క్యూట్ గా పాడిందో చూసారా..?
- క్యాష్ ఆన్ డెలివరీ తో.. నయా మోసం..!
- ఏపీలోని.. ఈ ప్రదేశంలో తాగి దొరికితే.. అంతే..!