Home » U19 women’s worldcup : అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా

U19 women’s worldcup : అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా

by Bunty
Ad

అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అండర్-19 మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళల క్రికెట్లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూలింది.

Advertisement

భారత బౌలర్లు సదు, అర్చన దేవి, పర్షవీ చోప్రా రెండేసి వికెట్లు తీయగా, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పేవిలియన్ కు క్యూ కట్టారు. ర్యానా మాక్ డోనాల్డ్ టాప్ స్కోరర్ గా నిలవగా, ముగ్గురు బాటర్లు డక్ అవుట్ అవ్వడం విశేషం. అనంతరం లక్ష్యచేదనకు దిగిన భారత అమ్మాయిలు 14 ఓవర్లలోనే మూడు వికెట్లకు కోల్పోయి 69 పరుగులు చేసి విజయన్నందుకుంది.

Advertisement

ఓపెనర్లు షేఫాలి వర్మ, శ్వేతా సెహ్రావత్ విఫలమైన, సౌమ్య తివారి, తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష రాణించి సంచలన విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హన్నా బెకర్, గ్రేస్ స్క్రీవెన్స్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఫైనల్ తో కలిపి మొత్తం 7 మ్యాచులు ఆడిన షెఫాలీ సేన, ఆస్ట్రేలియాతో మినహా ప్రతి మ్యాచ్ గెలిచింది. సెమీఫైనల్లో భారత్ కు కొరకరాని కొయ్యగా ఉన్న న్యూజిలాండ్ ను మట్టి కరిపించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.

read also : Taraka Ratna : తారక రత్నకు మెలేనా..ఈ వ్యాధి కారణాలు, లక్షణాలు ఇవే

Visitors Are Also Reading