Home » టీమిండియాకు షాక్‌.. రెండ‌వ టెస్ట్‌కు కోహ్లీ దూరం

టీమిండియాకు షాక్‌.. రెండ‌వ టెస్ట్‌కు కోహ్లీ దూరం

by Anji
Ad

టీమిండియా రెండో టెస్ట్ ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ది. స‌ఫారీ కంచుకోట సెంచూరియ‌న్‌ను బ‌ద్ద‌లు కొట్టి రెట్టించిన ఆత్మ‌విశ్వాసంతో ఉంది. సీమర్ల బలంతో తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ అనూహ్య రీతిలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక టాస్‌ గెలిచిన రాహుల్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా కోహ్లి స్థానంలో తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.

 

Advertisement

 

భార‌త జ‌ట్టు విష‌యానికొస్తే.. కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

 

Advertisement

ద‌క్షిణాఫ్రికా టీమ్‌.. డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్‌సెన్‌, కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌, డువానే ఒలివర్‌, లుంగి ఎంగిడి ఉన్నారు.

ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల‌ సిరిస్‌లో సెంచూరియ‌న్‌ గ్రౌండ్‌లో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజ‌యం సాధించింది. దీంతో నేడు జ‌ర‌గ‌బోయే రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది సిరిస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై క‌ల‌గా ఉన్న టెస్టు సిరిస్ భార‌త్ సొంత‌మ‌వుతుంది. నేడు జోహెన్నెస్‌బ‌ర్గ్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాగా, టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత‌ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమీండియాకు అనుకూలంగా ఉన్న జోహన్నెస్‌బ‌ర్గ్‌లో ఎలాగైన భార‌త్ గెలుపొందుతుంద‌న్న ధీమాలో ఉంది. చూడాలి మ‌రీ ఫ‌లితం ఏవిధంగా ఉంటుందో..

Visitors Are Also Reading