Home » హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే సూర్య వ‌ద్ద‌కు ఇన‌య‌..వైర‌ల్ అవుతున్న ఫోటో..!

హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే సూర్య వ‌ద్ద‌కు ఇన‌య‌..వైర‌ల్ అవుతున్న ఫోటో..!

by AJAY
Ad

అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లో ప్రేమ‌లు బ్రేక‌ప్ లు చాలా కామ‌న్. ఏ సీజ‌న్ లో అయినా సింగిల్ గా వ‌చ్చి జంటలుగా మారుతుంటారు. అయితే పెళ్లిళ్లు చేసుకోరు కానీ ఇంట్లో ఉన్నంత సేపు ఇద్ద‌రూ నిజంగా ప్రేమ‌లో ఉన్నారా అని అనుమానం వ‌చ్చేలా ఉంటారు. హౌస్ లో వాళ్ల‌ను చూసిన ఫ్యాన్స్ కూడా నిజంగానే త‌మ ఫేవ‌రెట్ కంటెస్టెంట్ లు ప్రేమ‌లో ఉన్నార‌ని అనుకుంటారు. ఇక ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 6 కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సీజ‌న్ లో ఇన‌య సూర్య ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు వినిపించాయి. ఇన‌య ఎక్కువ‌గా సూర్య‌తో క్లోజ్ గా ఉండ‌టం వ‌ల్ల ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని టాక్ వినిపించింది. ఇక ఇనయ నామినేష‌న్ తోనే సూర్య నామినేష‌న్ లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. కానీ ఎవ్వ‌రూ ఊహించని విధంగా ఆ నామినేష‌న్ తోనే సూర్య హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఆ త‌ర‌వాత ఇనయ కూడా చాలా బాధ‌ప‌డింది.

Advertisement

హౌస్ లో వీరిద్దరూ చిల‌కా గోరికల్లా ఉండేవారు. ఒక‌రినొక‌రు స‌పోర్ట్ చేసుకునేవాళ్లు కానీ సూర్య ఎలిమినేష‌న్ తో ఇన‌య ఒంట‌ర‌య్యింది. ఎంతో బాధ‌ప‌డింది. ఇక రీసెంట్ నామినేష‌న్స్ లో ఇన‌య సుల్తానా కూడా ఎలిమినేట్ అయ్యింది. అంతే కాకుండా బ‌య‌ట‌కు రాగానే ఇన‌య సుల్తాన సూర్య‌ను క‌లిసింది.

ఈ సంధ‌ర్బంగా వీరిద్ద‌రూ ఓ ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోను సూర్య త‌న ఇన్ట్సా గ్రామ్ లో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఫోటో చూసిన నెటిజ‌న్లు ఈ జంట ఎంత‌కాలం క‌లిసి ఉంటుందో చూడాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Visitors Are Also Reading