Home » ముందు మహిళలు.. తర్వాతే పురుషులు అంటున్న బీసీసీఐ..!

ముందు మహిళలు.. తర్వాతే పురుషులు అంటున్న బీసీసీఐ..!

by Azhar
Ad
ఐపీఎల్ అనేది క్రికెట్ ప్రపంచంలో ఎంత పెద్ద ఈవెంట్ అనే విషయం అందరికి తెలిసిందే. 2008 లో బీసీసీఐ ప్రారంభించిన ఈ ఐపీఎల్ అనేది ఈరోజు ప్రపంచంలోనే రెండో అతెపెద్ద క్రీడా లీగ్ గా నిలిచింది. అయితే ఐపీఎల్ వల్ల బీసీసీఐకి ఎన్నో లాభాలే కాకుండా.. భారత జట్టుకు చాలా మంది యువ ఆటగాళ్లు కూడా దొరికారు. ఈ రోజు మన పురుషుల జట్టు ఇంత బలంగా  ఉండటానికి ఐపీఎల్ కూడా ఒక్క కారణం.
అయితే ఈ ఐపీఎల్ ను చూసి విదేశీ బోర్డులు కూడా ఇదే రకమైన లీగ్ టోర్నీలను నిర్వహించాయి. అలాగే ఆ బోర్డులు పురుషులతో పాటుగా.. మహిళలకు కూడా ప్రత్యేక లీగ్స్ అనేవి నిర్వహిస్తూ వస్తున్నాయి. కానీ ఇన్నిరోజులు ఈ విషయంలో సైలెంట్ గా ఉండి.. మహిళల ఐపీఎల్ ను పెద్దగా పట్టించుకోని బీసీసీఐ.. వచ్చే ఏడాది నుండి దానిని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
అయితే పురుషుల ఐపీఎల్ అనేది ఏప్రిల్ లో ప్రారంభం అవుతుంది అనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇక నుండి ఈ ఐపీఎల్ విషయంలో ముందు మహిళలు.. తర్వాతే పురుషులు అనేలా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే… వచ్చే ఎద్ధి నుండి ప్రతి ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్ నిర్వహించి.. ఆ తర్వాత పురుషుల ఐపీఎల్ అనేది నిర్వహించాలని బీసీసీఐ ఫిక్స్ అయ్యింది. అయితే ఈ మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ కేవలం 6 జట్లతోనే జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading