Home » సలార్ మూవీలో ప్రభాస్ గొడ్డుకారం మాత్రమే తింటాడు.. ఎందుకో తెలుసా ?

సలార్ మూవీలో ప్రభాస్ గొడ్డుకారం మాత్రమే తింటాడు.. ఎందుకో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా గత నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లు సాధిస్తూ, కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో దేవరధ అలియాస్ సలార్ పాత్రలో ప్రభాస్ కనిపించగా, సినిమాలో చాలా బలవంతుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించాడు. అయితే అమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన బలాన్ని అంతటినీ తనలోనే అణచివేసుకుని గొడ్డుకారం తింటున్నా కోపం అనేది లేకుండా ఉంటాడని దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు.

Advertisement

అయితే గొడ్డుకారం తింటే పౌరుషం, కోపం పెరుగుతుందని అనుకుంటారు. కానీ, కోపాన్ని అణచివేసుకునే దేవా ఈ గొడ్డుకారం ఎందుకు తింటున్నాడో తెలుసా? ఎందుకు గుడ్డుకారంతోనే అన్నం తింటాడు అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఒక వ్యక్తి వీడియో చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పిన కారణం నవ్వు తెప్పించే విధంగా ఉంది.సినిమాలో ఒక చిన్నారి నా బర్త్ డే కేక్ కొయ్యమని జస్ట్ ఒక ప్లాస్టిక్ కత్తిని దేవా కి ఇవ్వగా.. అది చూసి వాళ్ళ అమ్మకి భయమేస్తుంది.

ఆ కత్తిచ్చేయ్ దేవా అని అరచి చెబుతుంది. అంటే దేవా వాళ్ళ అమ్మని అంతలా భయపెట్టాడని ఆ కత్తి చూసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి సలార్ లా, రాక్షసుడిలా మారిపోతాడని వాళ్ళమ్మ ఇంట్లో ఏ విధమైన కత్తులు, కత్తిపీటలు, కొడవళ్ళు లేకుండా చేసిందని చెప్పుకొచ్చాడు. అవి ఏమి లేనప్పుడు కూరగాయలు కోయడం కష్టం కాబట్టి వాళ్ళింట్లో ఏ కూరా ఉండదని చెప్పుకొచ్చాడు. అయితే సదరు వ్యక్తి చెప్పిన కారణం ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో కూడా దేవా గొడ్డుకారం లేకుండా అన్నం తినడు అని వరద తన మనుషులతో చెబుతాడు. కాబట్టి ఈ కత్తులు అంశం కాదు.. కానీ ఏదో బలమైన విషయమే మనోడి గొడ్డుకారం వెనక ఉంది. అది రెండో భాగంలో అయినా రివీల్ చేస్తారేమో వేచి చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading