Home » ఆషాడ మాసంలో ఆడవాళ్ళు.. ఈ ఆకుతో ఇలా చేస్తే అంతా అదృష్టమే..!

ఆషాడ మాసంలో ఆడవాళ్ళు.. ఈ ఆకుతో ఇలా చేస్తే అంతా అదృష్టమే..!

by Sravanthi
Ad

భారతీయులు పాటించే ప్రతి సంప్రదాయం వెనుక ఏదో ఒక సైన్స్ దాగి ఉంటుంది. పూర్వకాలం పెద్దలు అందులో ఏం గమనించి పెట్టారో ఏమో కానీ ప్రతి సంప్రదాయం వెనుక ఒక హిస్టరీ మాత్రం ఉంటుంది. ఈ సంప్రదాయం ప్రస్తుత కాలంలో ఎంతో ఉపయోగపడుతోంది. ఆ సంప్రదాయాల్లో ఒకటి గోరింటాకు. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి గోరింటాకు పెట్టుకొని ఉంటారు. అసలు ఈ గోరింటాకు ఎలా పుట్టిందంటే గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకుగా మారింది. గౌరీదేవి బాల్యంలో ఉన్నప్పుడు వనంలో ఆటలు ఆడే సమయంలో రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకిన వెంటనే ఒక మొక్క పుడుతుంది.

Advertisement

ఈ విషయాన్ని అక్కడున్న చెలికత్తెలు రాజుకు చెప్పగా ఆయన సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దగా అవుతుంది. సాక్షాత్తు పార్వతీ ఆజ్ఞతో జన్మిస్తుంది ఆ చెట్టు. అప్పుడు గౌరీదేవి ఆ చెట్టు ఆకు కోయడంతో ఆమె వేళ్ళు ఎర్రబడతాయి. అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపు పార్వతి ఏమి జరగలేదు నాకు ఆలంకారంగా అనిపిస్తుందని అంటుంది.దింతో ఈ గౌరీ టాకు మానవాళికి చాలా ఉపయోగ పడుతూ వస్తోంది. స్త్రీల యొక్క గర్భాశయ దోషాలను తొలగిస్తుంది.

Advertisement

అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది. అదే ఈ చెట్టుకు స్వార్థకథ అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు పసరుతో చేతులు కాళ్లు అన్నీ అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆషాడమాసంలో తల్లి గారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా తను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట. ప్రసవం అయిన వెంటనే ఆ బాలింతకు గోరింటాకు ముద్దను తినిపిస్తే రసం వల్ల కలిగిన కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది గోరింటాకు.

also read:

Visitors Are Also Reading