Home » 2023లో మూడు రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు..!

2023లో మూడు రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు..!

by Anji
Ad

2022 సంవత్సరానికి మరో 15 రోజుల్లో వీడ్కోలు చెప్పబోతున్నాం. 2023 కి స్వాగతం పలుకనున్నాం. వచ్చే నూతన సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి..? ఎవరికి రాజయోగం రాబోతుంది.. ఏ రాశుల వారు లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులవుతారు ? వంటి విషయాలు తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఆసక్తి  ఉంటుంది.2023లో ముఖ్యంగా మూడు రాశుల వారికి సంపదలకు అధిపతి అయినటువంటి గురువు కారణంగా రాజయోగం ఏర్పడి అనుకున్న కార్యాలు అన్నీ సిద్ధిస్తాయని.. సంపద పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మేషరాశి :

మేషరాశికి బాగా ధన యోగం లాభిస్తుంది. 2023 మధ్య ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అవకాశముంటుంది. 2023 మేషరాశి వారికి ఆర్థికపరంగా మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ మొత్తానికి చూస్తూ ఈ ఏడాది చివరి వరకు ఏదో ఒక రూపంలో ఆర్థిక పురోగతిని చూడడం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రాహువు సంచారం కూడా ఉండడం వల్ల అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేస్తారు. డబ్బు ఖర్చు చేేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరాలు రెండు, మూడు త్రైమాసికలు మెరుగుగా ఉంటాయని మంచి ఆదాయాన్ని పొందుతారని చివరలో కాస్త చిరాకు ఇబ్బందులు కలుగుతాయని ఒత్తిడికి గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి మేషరాశిలో గురుడి సంచారం వల్ల 2023లో మేషరాశి వారికి కలిసి వస్తుందని జోతిష్యులు పేర్కొంటున్నారు. 

Advertisement

మిథున రాశి :

2023లో కలిసొచ్చే రాశి మిథున రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి 2023 అదృష్టం వరిస్తుంది. ఈ రాశి వారు సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో సక్సెస్ అవుతారు. వీరికి ఉన్న కష్టాలన్నీ 2023లో పరిష్కారమవుతాయి. ఏప్రిల్ తరువాత ఈ రాశి వారికి గురుడు సంచారం కారణంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. 2023లో గొప్ప అవకాశాలు పొందుతారు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య వీరు కొంత ఆర్థిక పొదుపు చేయగలుగుతారు. డిసెంబర్ నెల వీరికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. 

తుల రాశి :

2023లో కలిసి వచ్చే మరో రాశి తుల రాశి.  ఈ రాశి వారికి 2023 చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి కూడా 2023లో చాలా అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి 2023 రాజయోగం సొంతింటిని నిర్మించుకోవడానికి, కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి 2023 సంవత్సరం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది రాజయోగం ఉండడం వల్ల వీరికి లక్కీ అనే చెప్పాలి. 2023లో వారు సంవత్సరం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కున్నప్పటికీ మే జూన్ మధ్యలో సుభప్రదమైన వార్తలు వింటారు. 2023లో ఈ రాశి వారికి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. 

Also Read :  Chanakya Niti : అమ్మాయిలో ఈ లక్షణాలు ఉంటే పెళ్లి చేసుకోవడానికి అస్సలు వెనుకడుగు వేయకండి..!

Visitors Are Also Reading