Home » ఇమ్మాన్యుయేల్ వర్ష మధ్య గ్యాప్..కన్నీరు పెట్టుకున్న ఇమ్ము..!!

ఇమ్మాన్యుయేల్ వర్ష మధ్య గ్యాప్..కన్నీరు పెట్టుకున్న ఇమ్ము..!!

by Sravanthi
Ad

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు పాపులర్ నటులుగా మారిపోయి కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఆ కోవా కి చెందిన వ్యక్తి ఇమాన్యుయల్.. తనదైన కామెడీ టైమింగ్ పంచులతో అందరినీ ఎంటైన్మెంట్ చేసే ఇమ్మానుయేల్ రియాలిటీ షోల ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించు కున్నారు. ముఖ్యంగా ఇమ్మానుయేల్ వర్ష జోడి ద్వారానే చాలామంది ప్రేక్షకులకు పరిచయ మయ్యారు. వీరిద్దరి జంట ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది.. ఇలాంటి జంటల్లో సుధీర్ రష్మీ టాప్ లో ఉండగా, వారి తర్వాత ఇమాన్యుల్ వర్షానే కనిపిస్తారు. చూడటానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉన్న వీరి మధ్య ఏదో నడుస్తుందని ప్రేక్షకులకు ఉన్న ఒక ప్రత్యేకమైన అనుమానం.

Advertisement

also read:‘NTR’ కి ఇష్టమైన వంటలు చేసే ఆ “కాంతమ్మత్త ఎవరో తెలుసా..?

వివరాల్లోకి వెళితే వీరిద్దరు జబర్దస్త్ షో ద్వారానే కలిసిపోయారు. కెవ్వు కార్తిక్ టీంలో ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య లవ్ పుట్టింది.. అలా మొదలైన వీరి జర్నీ మధ్యలో చిన్న చిన్న గొడవల వల్ల డిస్టర్బ్ అయినట్టు తెలుస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనే వర్షాని ‘ మగాడు’ అని ఇమాన్యుయల్ డైరెక్టుగా అనడం, ఆమె సీరియస్ అవడం, షో మధ్యలో నుంచి వెళ్లిపోవడం మనందరం చూశాం. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు వీరి మధ్య చాలా సీరియస్ ఇష్యూస్ వచ్చాయి. ఇక అప్పటినుంచి ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారట. దీంతో షో నిర్వాహకులు కూడా వీరిద్దరితో ఎలాంటి స్కిట్స్, ఎపిసోడ్స్ గాని ప్లాన్ చేయలేదట.

Advertisement

అయితే తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో మాత్రం ఆ విషయంపై ఇమాన్యుల్ ఓపెన్ అయిపోయాడు అనిపించింది. ” నువ్వంటే ప్రాణమని.. నీతోనే లోకమని ” అనే బ్రేకప్ పాటను ఇమ్ము పాడాడు. ఈ పెర్ఫార్మెన్స్ జరుగుతున్నంత సేపు వర్ష ఎమోషనల్ అయినట్టు కనిపించింది. కానీ ఆమె బయట పడలేదు.. ఇక ఆమె స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఏమైంది అని జడ్జి ఇంద్రజ అడిగినప్పటికీ మౌనంగానే ఉంది.. మరి అప్పటికీ ఇప్పటికీ వీరి మధ్య ఏం మార్పు రాలేదా.. అంటూ రష్మీ అడగ్గా అది ఎప్పటికీ మారదేమో అనిపించింది.. అందుకే ఇలా అంటూ ఇమ్మానియేల్ సమాధానం ఇచ్చారు. ఈ సిచువేషన్ అంతా చూస్తే వర్షాను ఇమాన్యుల్ నిజంగా ప్రేమిస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. ఇకపోతే వీళ్లిద్దరు ఇప్పటికీ మాట్లాడుకోవట్లేదని తెలుస్తోంది.. అసలు విషయం ఏంటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

also read:

Visitors Are Also Reading