Home » మరో సీక్వెల్ తో రాబోతున్న కార్తీ..!

మరో సీక్వెల్ తో రాబోతున్న కార్తీ..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆయన కోలీవుడ్ హీరో అయినా టాలీవుడ్ లో కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగారు.. అతడే కార్తీ.. యుగానికి ఒక్కడు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన కార్తీ, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం కార్తీ హీరోగా నటించిన ఖైదీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా ఖైదీ2 తెరకెక్కనుందని సమాచారం. లోకేష్ కనకరాజు క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Advertisement

అయితే కార్తీ చేసిన మరో చిత్రం “పొన్నియన్ సెల్వన్ ” ఈమధ్య కాలంలోనే రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా ఖైదీ 2 రానుంది. ఈ క్రమంలోనే ఆయన మరో సీక్వెల్ లో నటించేందుకు సిద్ధమవుతున్నారట. అదేంటయ్యా అంటే కార్తీ తాజాగా నటించి హీట్ కొట్టిన సర్దార్.. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన సర్దార్ మూవీకి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మంచి కంటెంట్ తో సినిమా నిర్మించారంటూ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దాని సక్సెస్ మీట్ లు తాజాగా నిర్వహించారు.

Advertisement

also read:సినీ ఆర్టిస్టుల బ‌తుకులు ఎలా ఉంటాయో వెల్ల‌డించిన ఎం.ఎస్. విక్ర‌మ్‌

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ సర్దార్ చిత్రాన్ని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. కొత్త కంటెంట్ తో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా నిర్మించబోతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పి ఎస్ మిత్రాన్, నిర్మాత ఎస్ లక్ష్మణ్ కుమార్, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. కట్ చేస్తే.. హీరో కార్తీకి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ఆయన ఇప్పటివరకు నటించి విడుదలైన మూడు చిత్రాలు సక్సెస్ అందుకున్నాయి. విరుమన్, పొన్నియన్ సెల్వన్, చిత్రాలు ప్రజాదారణ పొందగా, ఈ క్రమంలోనే సర్దార్ ఘనవిజయం అందుకుంది.

also read:

Visitors Are Also Reading