భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి డబ్బు పైన ఆశ ఉంటుంది. అందరికంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. తనకు ఎలాంటి కష్టం ఉండకుండా ఉండడానికి డబ్బు కారణమని.. అందుకే నిత్యం తనతో డబ్బు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే మన ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కళకళలాడాలి అంటే… కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తామర పువ్వు
Advertisement
తామర పువ్వులో లక్ష్మీదేవి ఉంటుందని నిపుణులు చెబుతారు. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. అందుకే లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు కచ్చితంగా తామర పువ్వు పెట్టాల్సిందే.
కొబ్బరికాయ
హిందువులు ప్రతి ఒక్కరూ దేవతలకు గానీ దేవుళ్ళకు గాని కొబ్బరికాయలు కొట్టడం సాంప్రదాయం. అలాగే లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టమట. అందుకే లక్ష్మీదేవి పూజ చేస్తే కచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలని చెబుతున్నారు.
Advertisement
తులసి
తులసి మొక్కలు ఆరోగ్యానికి మంచిది. అలాగే అవి చాలా పవిత్రమైనవి. అటు లక్ష్మీదేవికి కూడా తులసి మొక్క అంటే చాలా ప్రీతి. తులసి మొక్కలతో లక్ష్మీదేవి పూజ చేస్తే… మన వెంట ఆ దేవత ఉంటుందట.
శంఖం
మన హిందూమతంలో శంఖం చాలా గొప్పదని చెబుతారు. కాబట్టి నిత్యం మన ఇంట్లో లక్ష్మీ దేవత ఉండాలంటే… శంఖాన్ని కూడా కచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాల్సిందే. ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఎన్టీఆర్, వడ్డే నవీన్ కు కుటుంబ సభ్యులని తెలుసా ? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఇదే !
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !