సాధారణంగా ఎవ్వరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ జీవన శైలిలో భాగంగా చాలా మార్పులు వస్తుంటాయి. అలాంటి వారు మీ ఫిట్‌నెస్ స్థాయిని మెరుగు పరుచుకోవడానికి మీకు సమయం లేదని భావిస్తున్నారా..? అయితే మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ టిప్స్ పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఫిట్‌నెస్ కోసం గంటల గంటలు కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. భోజనం తరువాత కొద్దిసేపు అలా నడిస్తే చాలా మీ ఫిట్‌నెస్ మెరుగవుతుంది. ఈ అలవాట్లను తప్పక పాటించండి.
Advertisement
మీరు ప్రతి రోజు ఆహార పదార్థాలను ఇంట్లోనే తయారు చేసిన వాటిని తినండి. దీని ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకున్న వారమవుతాము. ఇంట్లో ఆహారం తినడం వల్ల శరీరానికి కావాల్సిన కేలరీలో నియంత్రణలభిస్తోంది. ఉద్యోగస్తులయినట్లయితే ప్రతిరోజు ఆహారాన్ని సిద్దం చేసుకుని మీతో పాటు తీసుకెళ్లండి. రాత్రి సమయంలో కూడా భోజనం తప్పకుండా చేయండి. నిద్ర పోవడానికి మూడు గంటల ముందే భోజనం చేయాలి. ఈ విధంగా భోజనం చేయడం ద్వారా మీరు తిన్న ఆహారం జీర్ణం కావడానికి శరీరానికి సమయం లభిస్తుంది. గాఢమైన నిద్ర పడుతుంది. రాత్రి వేళలో ఆకలితో పడుకోకూడదు. ఒకవేళ పడుకున్నట్టయితే అల్పహారం కోసం మెలుకువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
Advertisement
విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు, ఆందోళన నిరాశ, ఊబకాయం, తలనొప్పి, అల్జీమర్స్, జీర్ణాశయ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అధిక ఒత్తిడి మూలానా ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించడానికి వివిధ రకాల పద్దతులున్నాయి. వినోదభరితమైన టీవీ షో లు చూడడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలని చూస్తారు. కానీ ఆ షోలు చూడడం ద్వారా ఒత్తిడి ఇంకా పెరిగిపోతుందనే విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నిరంతరం మద్యం ఎక్కువ తాగితే మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వారానికి 14 ఆల్కహాల్ యూనిట్ల కంటే ఎక్కువగా మద్యం తీసుకోకూడదు. అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం, గుండె జబ్బులు, వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. మీ ఫిట్‌నెస్ స్థాయిని పెంచడానికి యోగా, పైలేట్స్ రెండు అద్భుతమైనవి. ఒత్తిడిని తగ్గించడానికి, కండరాల బలాన్ని పెంచడానికి కేలరీలను బర్న్ చేయడానికి మీకు ఎంతగానో సహాయపడుతాయి. యోగా, పైలేట్స్ మిమ్మల్ని మరింత శరీరానికి అనువుగా చేస్తాయి.
Also Read :
జీవిత భాగస్వాములకు పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్స్..ఎవరంటే..?
జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ లీక్.. ఇది షేక్ ఇమామ్ సీన్ మాదిరిగా..!